PM Narendra Modi: ముద్దు ముద్దు మాటలతో ప్రధాని మోడీని మెప్పించిన దివ్యాంగ బాలుడు.. నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న ఈ క్యూట్‌ కిడ్‌ ఎవరంటే..

PM Narendra Modi: ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఆయా ప్రాజెక్టుల..

PM Narendra Modi: ముద్దు ముద్దు మాటలతో ప్రధాని మోడీని మెప్పించిన దివ్యాంగ బాలుడు.. నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న ఈ క్యూట్‌ కిడ్‌ ఎవరంటే..
Pm Narendra Modi
Basha Shek

|

Jul 05, 2022 | 12:45 PM

PM Narendra Modi: ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఆయా ప్రాజెక్టుల సృష్టికర్తలతో సరదాగా ముచ్చటించారు. కాగా ప్రథమేశ్‌ సిన్హా (Prathamesh Sinha) అనే 11 ఏళ్ల దివ్యాంగ బాలుడు కూడా ఈ డిజిటల్‌ భారత్‌ వీక్‌లో భాగమయ్యాడు. థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న అతను యాన్నీ అనే గ్యాడ్జెట్ గురించి మోడీకి వివరించాడు. అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా థింకర్‌ బెల్‌ ల్యాబ్స్‌ ఈ పరికరాన్ని తయారుచేసింది. ప్రదర్శనలో దీనిని కూడా ఉంచారు. ఇక ఈ పరికరం గురించి ప్రథమేశ్‌ చెబుతున్నంతసేపు ఎంతో ఆసక్తిగా విన్నారు మోదీ. అనంతరం ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్‌?’ అంటూ ఆ బాలుడిని అడిగాడు. ‘పుణె నుంచి వచ్చాను’ అని చెప్పగా.. మోడీ చిన్నారి తలనిమిరి అభినందించారు.

ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే..

అనంతరం ప్రసంగించిన మోడీ ప్రథమేశ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘నేను ఆ బాలుడితో మాట్లాడినప్పుడు అతను.. ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని, భవిష్యత్తు కలలను సాకారం చేసుకుంటుందని నాలో విశ్వాసం మరింత పెరుగుతుంది’ అని ఆ చిన్నారిని అభినందించారు మోడీ. ఇక దీనికి సంబంధించిన వీడియోను థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.. ‘విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మేం యాన్నీ గ్యాడ్జెట్‌ను రూపొందించాం. చదువుకోవాలనుకునే చిన్నారులకు వైకల్యం అడ్డు కాకూడదు. ప్రథమేశ్ లాగే.. ఎంతోమంది అంధులకు ఈ యాన్నీ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గ్యాడ్జెట్‌ గురించి ప్రథమేశ్‌ ప్రధానికి వివరించడం మాకు ఎంతో గర్వంగా ఉంది’ అని రాసుకొచ్చింది. ఈ వీడియోను గుజరాత్‌ బీజేపీ కూడా తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

గతంలోనూ..

పుణెకు చెందిన ప్రథమేశ్ సిన్హా పుట్టుకతోనే అంధుడు. అయితే ప్రతిభకు వైకల్యం అడ్డురాదంటూ తన ట్యాలెంట్‌తో ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. గతేడాది బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌ తరఫున ప్రముఖ షో షార్క్‌ ట్యాంక్‌లో పాల్గొన్నాడు. అక్కడ యాన్నీ పరికరం గురించి ఎంతో అద్భుతంగా ప్రజెంటేషన్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. బోట్‌ లైఫ్‌స్టైల్‌ సీఈఓ అమన్‌ గుప్తా కూడా ఈ ప్రొగ్రామ్‌ చూసి ఫిదా అయ్యారు. ప్రథమేశ్‌ను ఏకంగా తన ఆఫీసుకు ఆహ్వానించారు. అంతేగాక, ఒకరోజు బోట్‌ సీఈఓగా పనిచేసే సదావకాశాన్ని కల్పించారు.

View this post on Instagram

A post shared by boAt (@boat.nirvana)

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu