Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamna Kasim Alias Poorna: పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న పూర్ణ!.. ఆ తర్వాత సినిమాల్లో నటించడంపై ఏమన్నదంటే..

Shamna Kasim Alias Poorna: అల్లరి నరేశ్‌ నటించిన సీమ టపాకాయ్‌ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది షమ్నా ఖాసీమ్‌ అలియాస్‌ పూర్ణ (Poorna). ఆ తర్వాత అవును, లడ్డూబాబు, శ్రీమహాలక్ష్మి, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, తలైవి,

Shamna Kasim Alias Poorna: పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న పూర్ణ!.. ఆ తర్వాత సినిమాల్లో నటించడంపై ఏమన్నదంటే..
Actress Poorna
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2022 | 9:06 AM

Shamna Kasim Alias Poorna: అల్లరి నరేశ్‌ నటించిన సీమ టపాకాయ్‌ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది షమ్నా ఖాసీమ్‌ అలియాస్‌ పూర్ణ (Poorna). ఆ తర్వాత అవును, లడ్డూబాబు, శ్రీమహాలక్ష్మి, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, తలైవి, అఖండ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటితో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె నటించిన అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు వెండితెరపై అలరిస్తోనే మరోవైపు బుల్లితెరపై పలు డ్యాన్స్‌ రియాలటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ అందాల తార వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిందీ ముద్దుగుమ్మ. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.

కాగా షానిద్‌- పూర్ణల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 6న వీరిద్దరు ఏడడుగులు నడవనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో స్వయంగా వెల్లడించారు పూర్ణ. మ్యారేజ్‌ డేట్‌తో పాటు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ సొగసరి. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని, పెళ్లయ్యాక దుబాయిలో స్థిరపడతామని పూర్ణ చెప్పుకొచ్చింది. కాగా యూఏఈ వేదికగా ఉన్న జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి షానిద్‌ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నాడు షానిద్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..