PV Sindhu: రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన బ్యాడ్మింటన్‌ క్వీన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

PV Sindhu: బ్యాడ్మింటన్‌లో కోర్టులో ఆటతోనే కాదు అప్పుడప్పుడూ తన ఆటపాటలతోనూ అలరిస్తోంది బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధు (PV Sindhu). సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె గతంలో కచ్చాబాదం, మాయాకిర్రియే, బీస్ట్ అరబిక్‌ కుతు..

PV Sindhu: రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన బ్యాడ్మింటన్‌ క్వీన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Pv Sindhu
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2022 | 11:03 AM

PV Sindhu: బ్యాడ్మింటన్‌లో కోర్టులో ఆటతోనే కాదు అప్పుడప్పుడూ తన ఆటపాటలతోనూ అలరిస్తోంది బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధు (PV Sindhu). సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె గతంలో కచ్చాబాదం, మాయాకిర్రియే, బీస్ట్ అరబిక్‌ కుతు తదితర పాటలకు సరదాగా స్టెప్పులేసి అలరించింది. తాజాగా మరో రీమీక్స్‌ పాటకు కాలు కదిపింది. ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉన్న ఆమె ఓ ట్విన్‌ టవర్‌ వద్ద ఈ డ్యాన్స్‌ చేస్తూ వీడియోని, అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ‘మీకు ఏదైతే నిజమైన సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని కచ్చితంగా చేయండి’ అంటూ సింధూ చేసిన డ్యాన్స్‌కు యూజర్ల నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ లభిస్తోంది. ఇప్పటివరకు 2.47 లక్షల మంది ఈ వీడియోకు లైకులు కొట్టడం విశేషం.

కాగా సింధు స్పోర్ట్స్‌ స్టార్‌గానే కాకుండా ..డ్యాన్సులు, కలర్‌ఫుల్ ఫొటోషూట్లతో సోషల్‌ మీడియా స్టార్‌గా మారింది. ఆమె షేర్‌ చేస్తోన్న గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలకు అభిమానుల నుంచి లైకుల వర్షం కురుస్తోంది. ఇక ఆటవిషయానికొస్తే.. ప్రస్తుతం జరుగుతోన్న మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్లో క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు పరాజయం పాలైంది. చైనీస్‌ తైపీకి చెందిన తాయ్‌ జు యింగ్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఆమె ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..