Viral Video: వీడి తెలివి తగలెయ్యా.. తుపాకీ చూపించి మొబైల్‌ కొట్టేశాడు.. చివరకు ఊహించని ట్విస్ట్‌..

Viral Video: దొంగల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. కొంతమంది దొంగలు రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడితే మరికొందరు పట్టపగలే దోపిడీలకు వెళుతుంటారు. దొంగతనానికి ఎప్పుడు వెళ్లినా, ఎలా వెళ్లినా తెలివి, సమయస్ఫూర్తి మాత్రం ఉండాల్సిందే. ఈక్రమంలో ఓ తెలివైన దొంగ బొమ్మ తుపాకీ చూపించి..

Viral Video: వీడి తెలివి తగలెయ్యా.. తుపాకీ చూపించి మొబైల్‌ కొట్టేశాడు.. చివరకు ఊహించని ట్విస్ట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2022 | 6:09 PM

Viral Video: దొంగల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. కొంతమంది దొంగలు రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడితే మరికొందరు పట్టపగలే దోపిడీలకు వెళుతుంటారు. దొంగతనానికి ఎప్పుడు వెళ్లినా, ఎలా వెళ్లినా తెలివి, సమయస్ఫూర్తి మాత్రం ఉండాల్సిందే. ఈక్రమంలో ఓ తెలివైన దొంగ బొమ్మ తుపాకీ చూపించి నడి రోడ్డుపై సునాయసంగా స్మార్ట్‌ఫోన్‌ కొట్టేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనాలు జోరుగా వెళుతున్నాయి. రహదారి పక్కనే కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉండగా.. వాటి ముందు ఓ వ్యక్తి కుర్చీలో తాపీగా కూర్చుని దర్జాగా తన మొబైల్‌తో ఆడుకుంటూ ఉంటాడు. అతనికి సమీపంలో ఓ కుర్రాడు కూడా ఉంటాడు. ఇంతలో మొహానికి ముసుగు వేసుకున్న ఓ దొంగ అక్కడికి వస్తాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తిని దాటుకుంటూ ముందుకు వెళతాడు. అయితే ఇదేమీ పట్టించుకోని అతను మొబైల్‌ చూస్తూనే ఉండిపోతాడు. ఈక్రమంలో చుట్టుపక్కల పరిస్థితులను నిశీతంగా గమనించిన దొంగ మళ్లీ వెనక్కు వస్తాడు. దాచుకున్న గన్ తీసి.. మొబైల్ ఇవ్వమని బెదిరిస్తాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఆ వ్యక్తి మొబైల్ ఇచ్చేస్తాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Supercars ? Cars ? Exotics (@superautovip)

బొమ్మ తుపాకీతో భలే బోల్తా కొట్టించాడుగా..

అయితే ఇది గమనించిన పక్కనే ఉన్న కుర్రాడు ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇంతలో దొంగ దగ్గరున్న గన్‌ను చూసి కాస్త వెనక్కి తగ్గుతాడు. అయితే దొంగ కాల్చినా అతనికి ఏమీ కాదు. ఇంతలో బైక్‌ వేసుకుని మరో వ్యక్తి అక్కడకు వస్తాడు. దీంతో ఆ బైక్‌ ఎక్కి అక్కడి నుంచి తీరిగ్గా వెళ్లిపోతాడు దొంగ. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే.. ఆ దొంగ దగ్గర ఉంది బొమ్మ తుపాకీ అన్నమాట. superautovip అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆ దొంగ బాగా తెలివి మీరిపోయాడు. బొమ్మ తుపాకీతో భలే బోల్తా కొట్టించాడుగా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ