MS Dhoni: గాడ్‌ ఫాదర్‌ లుక్‌లో కెప్టెన్‌ కూల్‌.. అదిరిపోయిందంటోన్న ఫ్యాన్స్‌..

God Father: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ (God Father). మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.హనుమాన్‌ జంక్షన్‌ ఫేం మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార,

MS Dhoni: గాడ్‌ ఫాదర్‌ లుక్‌లో కెప్టెన్‌ కూల్‌.. అదిరిపోయిందంటోన్న ఫ్యాన్స్‌..
MS Dhoni
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2022 | 3:24 PM

God Father: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ (God Father). మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.హనుమాన్‌ జంక్షన్‌ ఫేం మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి మెగాస్టార్ మొదటి లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో నెరిసిన జట్టుతో బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించి మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట్‌ ట్రెండ్‌ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో మెగాస్టార్‌ లుక్‌పై పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గాడ్‌ఫాదర్‌ లుక్‌ పోస్టర్‌లో చిరంజీవికి బదులు టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ఉంటే ఎలా ఉంటుంది? స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు ఇలాగే ఆలోచించింది. గాడ్‌ఫాదర్‌ లుక్‌లో ధోని ఎడిటెడ్‌ ఫొటోను షేర్‌ చేసింది.

‘నో క్లాస్‌- నో మాస్‌, ఓన్లీ కూల్‌, వన్‌ అండ్‌ ఓన్లీ తలా’ అంటూ షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. దీనిని చూసి అటు మెగాస్టార్‌ ఫ్యా్న్స్‌, ఇటు ధోని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్‌ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ధోని తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (జులై 4) ధోని, సాక్షి పెళ్లిపీటలెక్కారు. ఈక్రమంలోనే మ్యారేజ్‌ డేని ఎంజాయ్‌ చేయడానికి ఇంగ్లండ్‌ లో అడుగుపెట్టారు ధోని దంపతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ