లింగ సమానత్వం దిశగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరో ముందడుగు.. పురుష, మహిళా క్రికెటర్ల వేతనాల చెల్లింపుపై చారిత్రాత్మక నిర్ణయం..
New Zealand Cricket: లింగ సమానత్వం సాధించే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ క్రికెట్‌లోనే తొలిసారిగా పురుష క్రికెటర్లతో పాటుగా మహిళా క్రికెటర్లకు కూడా సమాన వేతనాలు చెల్లించనుంది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
New Zealand Cricket: లింగ సమానత్వం సాధించే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ క్రికెట్‌లోనే తొలిసారిగా పురుష క్రికెటర్లతో పాటుగా మహిళా క్రికెటర్లకు కూడా సమాన వేతనాలు చెల్లించనుంది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుకు ఆడే మెన్ అండ్ విమెన్ క్రికెటర్లతో పాటు దేశవాళీలో ఆడే ఆటగాళ్లకు కూడా ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఈ మేరకు టీ20లు, వన్డేలు, టెస్టులు, ఫోర్డ్ ట్రోఫీ, సూపర్ స్మాష్ లెవల్ తో పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రికెటర్లందరికీ లింగ బేధం లేకుండా సమాన వేతనాలు ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. రాబోయే ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉండనుంది. కాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లకూ సమానంగా మ్యాచ్ ఫీజులను అందించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం NZC తో పాటు, న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్, క్రికెటర్లకు సంబంధించిన మరో ఆరు అసోసియేషన్స్ దీని మీదే పనిచేస్తున్నాయని న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.
ఈ నిర్ణయం గేమ్ ఛేంజర్..
కాగా తాజా ఒప్పందం ప్రకారం.. రాబోయే ఐదేళ్ల కాలంలో తమకు వచ్చే ఆదాయం (349 న్యూజిలాండ్ మిలియన్ డాలర్లని అంచనా) మెన్, విమెన్ ప్రొఫెషనల్ ప్లేయర్లకు 29.75 శాతం ఆదాయాన్ని సమానంగా పంచనున్నారు. ఇక ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్ గేమ్ ఛేంజర్ గా అభివర్ణించింది. ‘పురుష, మహిళ క్రికెటర్లకు సమాన వేతనాలు కల్పిస్తూ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మహిళా క్రికెటర్లకు కూడా గుర్తింపు, ఆదరణ దక్కుతుంది. దేశంలో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే అమ్మాయిలకు ఇది చాలా మంచి అవకాశం. ఇదే విషయమై పురుషుల జట్టు సారథి కేన్ విలియమ్సన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత ఆటగాళ్లు మనకంటే ముందు ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగించాలి. రేపటి తరం ఆటగాళ్లకు అన్ని స్థాయుల్లో మద్దతు ఇవ్వాలి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఈ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది’ అని కేన్‌మామ చెప్పుకొచ్చాడు.
New Zealand cricket takes the first step towards gender pay equality!https://t.co/zt8RIBilR0 pic.twitter.com/seGeaIiUP7
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2022
Landmark day for all levels of cricket in New Zealand ? #CricketNationhttps://t.co/WCSjTAl9Q8
— BLACKCAPS (@BLACKCAPS) July 4, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..