AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA Abhishek Sharma : సఫారీలతో సమరానికి ముందు సూర్య మాస్టర్ ప్లాన్.. అభిషేక్ మళ్ళీ పుంజుకుంటాడా?

IND vs SA Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన వేట మొదలైంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగురవేసిన టీమిండియా, ఇప్పుడు సూపర్-8 రౌండ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమైంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా గత ప్రపంచకప్ రన్నరప్ సౌతాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది.

IND vs SA Abhishek Sharma : సఫారీలతో సమరానికి ముందు సూర్య మాస్టర్ ప్లాన్.. అభిషేక్ మళ్ళీ పుంజుకుంటాడా?
దీంతో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ చారిత్రాత్మక విజయంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ప్రధాన రికార్డును సృష్టించాడు.
Rakesh
|

Updated on: Feb 21, 2026 | 5:44 PM

Share

IND vs SA Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన వేట మొదలైంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగురవేసిన టీమిండియా, ఇప్పుడు సూపర్-8 రౌండ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమైంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా గత ప్రపంచకప్ రన్నరప్ సౌతాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి, అందరి చర్చా ఒక్కరి గురించే.. ఆయనే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ (సున్నా పరుగులు) అయి నిరాశపరిచిన అభిషేక్ ఫామ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో అభిమానులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా కూల్‌గా ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన పడుతున్న వారిని చూస్తేనే నాకు జాలేస్తోంది. నాకు అభిషేక్ గురించి భయం లేదు, కానీ అతడిని ఎదుర్కోబోయే ప్రత్యర్థి జట్ల గురించి మాత్రం చాలా టెన్షన్ గా ఉంది. గత ఏడాది కాలంగా అభిషేక్ జట్టు కోసం ఎంతో చేశాడు, ఇప్పుడు అతనిపై నమ్మకం ఉంచి ఆ బాకీ తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది” అని సూర్య గంభీరంగా సమాధానమిచ్చాడు.

ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అభిషేక్ శర్మను భారత బ్యాటింగ్ వెన్నెముకగా భావించారు. కానీ టోర్నీ మొదలైనప్పటి నుంచి అతడిని దురదృష్టం వెంటాడుతోంది. మొదటి మ్యాచ్‌లోనే సున్నాకే వెనుదిరగడమే కాకుండా, ఆ తర్వాత తీవ్ర అనారోగ్యం పాలై రెండు రోజుల పాటు ఆసుపత్రిలో కూడా ఉండాల్సి వచ్చింది. కోలుకుని జట్టులోకి వచ్చినా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. ఒకే నెలలో ఆడిన ఎనిమిది టీ20 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు సున్నాకే అవుట్ కావడం ఎవరికైనా ఆందోళన కలిగించే విషయమే. కానీ కెప్టెన్ సూర్య మాత్రం అభిషేక్ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అన్ని విమర్శలకు చెక్ పెడతాడని నమ్ముతున్నాడు.

లీగ్ దశలో పసికూనలపై గెలిచినంత సులభంగా సూపర్-8 ఉండదు. ఇక్కడ సౌతాఫ్రికా వంటి బలమైన జట్టుతో తలపడాల్సి ఉంది. ఒకవేళ సౌతాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌లో కూడా అభిషేక్ త్వరగా అవుట్ అయితే మాత్రం టీమిండియా చిక్కుల్లో పడటం ఖాయం. మీడియా ముందు కెప్టెన్ ఎంత ధైర్యంగా మాట్లాడినా, తెర వెనుక మాత్రం ఒత్తిడి ఉందనేది వాస్తవం. అభిషేక్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడా? లేక సూర్య నమ్మకాన్ని వమ్ము చేస్తాడా? అనేది ఆదివారం తేలిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి