AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రసాయనాలకు చెక్ పెట్టండి.. ఇంట్లోనే కొబ్బరి నూనెతో సహజమైన లిప్ బామ్ తయారీ ఇలా!

ముందుగా బీవాక్స్‌ను తురుముకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీనివల్ల అది త్వరగా కరుగుతుంది. ఇప్పుడు డబుల్ బాయిలర్ పద్ధతిని ఉపయోగించాలి. అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేస్తూ, దానిపై మరో గిన్నె ఉంచి అందులో బీవాక్స్, కొబ్బరి నూనె వేయాలి. తక్కువ మంటపై మధ్యమధ్యలో కలుపుతూ పూర్తిగా కరగనివ్వాలి. బీవాక్స్‌ను నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు, ఎందుకంటే నూనె మరియు మైనం మాడిపోయే అవకాశం ఉంటుంది. మిశ్రమం పూర్తిగా కరిగిన తర్వాత దానిని శుభ్రమైన కంటైనర్ లేదా ట్యూబ్‌లో పోసి 30 నుండి 45 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. గట్టిపడిన తర్వాత హోమ్‌మేడ్ లిప్ బామ్ వాడకానికి సిద్ధమవుతుంది.

రసాయనాలకు చెక్ పెట్టండి.. ఇంట్లోనే కొబ్బరి నూనెతో సహజమైన లిప్ బామ్ తయారీ ఇలా!
Homemade Lip BalmImage Credit source: AI Image
Jyothi Gadda
|

Updated on: Nov 26, 2026 | 10:21 AM

Share

మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా పెదాలు త్వరగా పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మార్కెట్లో లభించే లిప్ బామ్‌లను వాడుతుంటారు. అయితే వాటిలో ఉండే రసాయనాల వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. పెదాలను సహజంగా మృదువుగా ఉంచుకోవడానికి ఇంట్లోనే కొబ్బరి నూనెతో లిప్ బామ్ తయారు చేసుకోవడం ఎంతో సురక్షితం.

కావలసిన పదార్థాలు

కొబ్బరి నూనె

బీవాక్స్ (తేనెటీగల మైనం)

ఇవి కూడా చదవండి

శుభ్రమైన, పొడి కంటైనర్ లేదా లిప్ బామ్ ట్యూబ్

తయారీ విధానం

ముందుగా బీవాక్స్‌ను తురుముకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీనివల్ల అది త్వరగా కరుగుతుంది. ఇప్పుడు డబుల్ బాయిలర్ పద్ధతిని ఉపయోగించాలి. అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేస్తూ, దానిపై మరో గిన్నె ఉంచి అందులో బీవాక్స్, కొబ్బరి నూనె వేయాలి. తక్కువ మంటపై మధ్యమధ్యలో కలుపుతూ పూర్తిగా కరగనివ్వాలి. బీవాక్స్‌ను నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు, ఎందుకంటే నూనె మరియు మైనం మాడిపోయే అవకాశం ఉంటుంది. మిశ్రమం పూర్తిగా కరిగిన తర్వాత దానిని శుభ్రమైన కంటైనర్ లేదా ట్యూబ్‌లో పోసి 30 నుండి 45 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. గట్టిపడిన తర్వాత హోమ్‌మేడ్ లిప్ బామ్ వాడకానికి సిద్ధమవుతుంది.

కొబ్బరి నూనె, బీవాక్స్ ప్రయోజనాలు

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్లు, ట్రైగ్లిజరైడ్లు పెదాలను మృదువుగా ఉంచుతాయి. ఇది చర్మం లోపలి పొరల వరకు తేమను అందించి పొడిబారడం, పగుళ్లను నివారిస్తుంది. ఇక బీవాక్స్ లిప్ బామ్‌కు సరైన ఆకృతిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది పెదాలపై తేలికపాటి రక్షణ పొరను ఏర్పరిచి తేమ ఆవిరైపోకుండా కాపాడుతుంది.

నిల్వ చేసేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు

లిప్ బామ్ నింపే ముందు కంటైనర్‌ను బాగా శుభ్రం చేసి ఆరబెట్టాలి. నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్ డబ్బాలను వాడటం ఉత్తమం. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఈ లిప్ బామ్ సుమారు 1 నుండి 1.5 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us