శ్రీదివ్యకు ఇంత అందమైన అక్క ఉందా.! ఆమె కూడా హీరోయిన్ గా చేసింది
తెలుగులో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. కానీ ఈ వయ్యారికి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ సినిమాతో యూత్ ను ఆక్టటుకుంది.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి. ఇటీవలే ఆయనప్రభాస్ హీరోగా పెట్టి రాజా సాబ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలా చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు మారుతి. ఇదిలా ఉంటే మారుతి సినిమాల్లో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా బస్ స్టాప్. ప్రిన్స్, శ్రీదివ్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
అందమైన ప్రేమకథతో పాటు ఆకట్టుకునే కామెడీ ఉంటుంది ఈ సినిమాలో.. అయితే ఈ సినిమా తర్వాత శ్రీదివ్య క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో శ్రీదివ్యకు మంచి డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత కేరింత సినిమాతో హిట్ అందుకుంది ఈ భామ. కానీ తెలుగు కంటే తమిళ్ లో శ్రీదివ్య ఎక్కువ ఆఫర్స్ అందుకుంది. కోలీవుడ్ లో ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో శివ కార్తికేయన్, కార్తీ , విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?
శ్రీ దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది. మనసారా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బస్ స్టాప్, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు, కేరింత సినిమాలు చేసింది. అయితే ఎక్కువగా ఈ అమ్మడు తమిళ్ లోనే సినిమాలు చేసింది. అయితే శ్రీదివ్య మాత్రమే కాదు ఆమె అక్క కూడా హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా.? అవును ఆమె కూడా ఓ క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు శ్రీ రమ్య. ఈ అమ్మడు కూడా చాలా అందంగా ఉంటుంది. 2008లో వచ్చిన 1940లో ఒక గ్రామం అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమాతో నంది అవార్డు సైతం గెలుచుకుంది. ఆతర్వాత శ్రీకాంత్‌తో విరోధి, అలియాస్ జానకి వంటి సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేసింది శ్రీ రమ్య. కానీ ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు ఈ అమ్మడు.
ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




