AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2026 Hall Tickets: రేపట్నుంచే ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఈ, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ 2026) ఆన్ లైన్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు రేపు (ఏప్రిల్‌ 28) విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన..

AP EAPCET 2026 Hall Tickets: రేపట్నుంచే ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
AP EAPCET Admit Card
Srilakshmi C
|

Updated on: Apr 27, 2026 | 6:00 AM

Share

అమరావతి, ఏప్రిల్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీటెక్‌, బీఈ, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ 2026) పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు రేపు (ఏప్రిల్‌ 28) విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 28న హాల్‌ టికెట్లు విడుదల కానున్నాయి. ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్‌ టికెట్లు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మే 12 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో జారా చేసిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఈఏపీసెట్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ మే 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ప్రిలిమినరీ కీ మే 23న విడుదల చేసి కీ పై అభ్యంతరాలను మే 25 వరకు స్వీకరించనున్నారు. ఇక జూన్‌ 1న ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు వెలువడనునున్నాయి.

రాత పరీక్ష విధానం..

మొత్తం 160 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో గుర్తించాలి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, తెలుగు మీడియంలో ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు ఉండవు. ఇంజినీరింగ్‌ విభాగంలో మ్యాథమెటిక్స్‌లో 80, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌లో బోటనిలో 40, జువాలజీలో 40, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us