AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు తీశా.. నా కాళ్లు మొక్కి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు..

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ప్రత్యేకమైన దర్శకత్వ శైలిని పంచుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నుండి అడవిరాముడు వంటి మాస్ చిత్రాల వరకు తన ప్రయాణాన్ని వివరించారు. ఎన్టీఆర్, చిరంజీవి, శ్రీదేవి వంటి తారలతో తన అనుబంధం గుర్తుచేసుకున్నారు.

K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు తీశా.. నా కాళ్లు మొక్కి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు..
Raghavendra Rao
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2026 | 8:55 PM

Share

ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన విశిష్టమైన సినీ కెరీర్, ముఖ్యమైన మైలురాళ్లు, పలువురు ప్రముఖ నటులతో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన చిత్రాల్లో ఒక గ్రాండియర్, విజువల్ స్టోరీ టెల్లింగ్, ముఖ్యంగా పాటల చిత్రీకరణలో పండ్లు, పూల అద్భుతమైన వాడకంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను సృష్టించుకున్నారు. ఈ శైలి తెలుగు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుందని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాఘవేంద్ర రావు సినిమా అంటే స్వర్గాన్ని నేల మీదకి దించినట్టే అని ప్రశంసించారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో జ్యోతి, దేవత, అమరదీపం వంటి లేడీ ఓరియెంటెడ్, ఫ్యామిలీ డ్రామా చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అయితే, కేవలం అటువంటి చిత్రాలకే పరిమితం కాకుండా, మాస్ కమర్షియల్ చిత్రాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అడవిరాముడు చిత్రం ఎన్.టి. రామారావుతో చేసే అవకాశం వచ్చిందని వివరించారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కారెక్టరైజేషన్‌ను వినూత్నంగా చిత్రీకరించాలని ఆలోచించి, ఏనుగుపై గజారోహణం చేసే దృశ్యాన్ని రూపొందించినట్లు చెప్పారు. 38 రోజుల్లో అడవిరాముడు చిత్రీకరణ పూర్తయిందని, జ్యోతి లాంటి సినిమాలు కేవలం 28 రోజుల్లోనే పూర్తి చేశామని, నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడంలో తన నిబద్ధతను తెలియజేశారు. నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో వేగంగా పని చేసేవారమని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

కె. రాఘవేంద్ర రావు మూడు తరాల నటులతో పనిచేసిన అరుదైన దర్శకుడు. ఎన్.టి. రామారావుతో 12 సినిమాలు, చిరంజీవితో 14 సినిమాలు, అలాగే బాలకృష్ణ, తారకరత్న, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, కృష్ణ, మహేష్ బాబు, శ్రీకాంత్ వంటి తారలతో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఏ హీరో కూడా తన దర్శకత్వం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అది తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు దాసరి నారాయణరావుతో కూడా తమకు మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేదని, ఒకరి తర్వాత ఒకరు పోటీగా సినిమాలు తీస్తూ ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించామని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

తన కెరీర్‌లో శ్రీదేవితో 24 చిత్రాలలో పనిచేశానని, తెలుగులో ఊరికి మొనగాడు సినిమాను హిందీలో జితేంద్ర, శ్రీదేవిలతో రీమేక్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం మామ్ ఆడియో ఫంక్షన్‌కు తనను ముఖ్య అతిథిగా పిలిచిందని, అప్పుడు ఆమె తనతో 25వ సినిమా గురించి మాట్లాడిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఆమె తన కాళ్ళకు నమస్కరించి, మళ్ళీ కలిసి పనిచేయాలని కోరిందని గుర్తుచేసుకున్నారు. అటువంటి గొప్ప నటి ఆకస్మిక మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us