AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!

ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం (Weight Loss) అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. దీని కోసం జిమ్‌లు, కఠినమైన డైటింగ్‌లు చేస్తుంటారు. అయితే, మన వంటగదిలోనే బరువును తగ్గించే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని మీకు తెలుసా? భారతీయ సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగించే యాలకులు (Cardamom), లవంగాలు (Cloves), దాల్చినచెక్క (Cinnamon) పొడుల కలయిక బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక పవర్‌హౌస్‌లా పనిచేస్తుంది.

జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
Healthy Morning Drink
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2026 | 7:52 AM

Share

మన వంటగదిలో దొరికే యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క కేవలం రుచికే కాదు, బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మూడు సుగంధ ద్రవ్యాల పొడులను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం వేగవంతమై, కొవ్వు వేగంగా కరుగుతుంది. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్కలలో యాంటీఆక్సిడెంట్లు, శోథ నిరోధక (Anti-inflammatory) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియను (Metabolism) వేగవంతం చేస్తాయి. మెటబాలిజం రేటు పెరిగినప్పుడు, శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నా కూడా క్యాలరీలు, కొవ్వు వేగంగా కరుగుతాయి.

ఈ మూడు పొడుల మిశ్రమం జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ బాగుంటే బరువు తగ్గడం మరింత సులువవుతుంది. ముఖ్యంగా దాల్చినచెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా మాటిమాటికీ ఆకలి వేయడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మనం అనవసరమైన జంక్ ఫుడ్ తినకుండా నియంత్రించుకోవచ్చు. ఈ మిశ్రమం శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది. లవంగాల్లో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఎలా ఉపయోగించాలి?: సమాన పరిమాణంలో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్కలను తీసుకుని దోరగా వేయించి, మిక్సీలో మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఈ పొడిని కలిపి తాగాలి. రుచి కోసం కావాలనుకుంటే కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ సహజసిద్ధమైన పొడిని రోజూ తీసుకుంటూ, దాంతో పాటు సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కేవలం కొన్ని వారాల్లోనే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి, ఆరోగ్యకరమైన మార్పును గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు