AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Sakuntala: తెలంగాణ శకుంతల ఎలా చనిపోయారు? ఆమె శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో పేరు ఎందుకుందో తెలుసా?

తెలంగాణ శకుంతల.. మహారాష్ట్రలో పుట్టి పెరిగినా తెలుగులో స్టార్ నటిగా రాణించారామె. దాదాపు 250 కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారామె. తెలంగాణతో పాటు రాయలసీమ యాసలోనూ డైలాగులు చెప్పి అందరి మన్ననలు అందుకున్నారు. అయితే ఈ నటి చనిపోయాక ఆమె శవపేటికపై ఒక టాలీవుడ్ హీరో పేరు ముద్రించి ఉందట.

Telangana Sakuntala: తెలంగాణ శకుంతల ఎలా చనిపోయారు? ఆమె శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో పేరు ఎందుకుందో తెలుసా?
Telangana Sakuntala
Basha Shek
|

Updated on: Jun 11, 2026 | 8:43 PM

Share

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన శకుంతల అసలు పేరు కడియాల శకుంతల. సినిమాల్లోకి రాక ముందు పలు నాటకాల్లో నటించారామె. తన అద్భుత అభినయంతో మంచి రంగ స్థలం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1979లో మా భూమి సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు శకుంతల. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన వారైనా తెలుగును చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన ఆమె ఇంటి పేరు తెలంగాణ శకుంతల గా మారిపోయింది. తెలుగులో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారామె. ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క సారక్క, అహ నా పెళ్ళంటా, గులాబి, ఇంద్ర, గంగోత్రి , నువ్వు- నేను, ఒక్కడు, అడవి రాముడు, దొంగ దొంగది, దుబాయ్ శీను, దేశ ముదురు, బిందాస్, ఏమైంది ఈవేళ .. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించారీ సీనియర్ నటి. చివరిగా 2014లో పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమాలో కనిపించారామె.

తెలుగుతో పాటు కొన్ని తమిళ సినిమాల్లో నటించిన తెలంగాణ శకుంతల 2014 జూన్ 14న గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు దాదాపు 63 సంవత్సరాలు. కాగా తెలంగాణ శకుంతల మరణానికి, అంత్యక్రియలకు సంబంధించి టాలీవుడ్ నటుడు శివాజీ రాజా గతంలో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే.. బ్యాంకాక్‌లో షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు శకుంతలకు గుండె పోటు వచ్చిందట. ఆ సమయంలో ఆమె చేతిలో డబ్బులు లేక బాగా ఇబ్బంది పడ్డారట. అయితే ఈ విషయం తెలుసుకున్న శివాజీ రాజా ఆమెను దగ్గరుండి హైదరాబాద్ తీసుకొచ్చారట. ఆ సంఘటన తర్వాత శకుంతల నాకు శివాజీ ఉంటే చాలు, వాడు నన్ను బంగారంలో చూసుకుంటాడు అని ప్రెస్ మీట్‌లో చెప్పారట. అంతేకాదు శకుంతల మరణానంతరం ఆమె పార్థివ దేహం తీసుకువెళ్లే పెట్టె మీదమీద శివాజీ అనే పేరు రాసి ఉందట. అది చూసి శివాజీ రాజా కూడా బాగా ఎమోషనల్ అయ్యారట.

ఇవి కూడా చదవండి

తెలంగాణ శకుంతల శవపేటికపై శివాజీ రాజా పేరు..

Telangana Sakuntala 1

Telangana Sakuntala

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ