AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఒక్క పాటతో సెన్సేషన్.. కట్ చేస్తే.. ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. 80 కోట్లు పెడితే 8 కోట్లు కూడా రాలేదు..

సినిమా పరిశ్రమలో ఒక సినిమా విడుదలవుతుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ప్రమోషన్లు, స్టార్ కాస్టింగ్ వంటివి ఆ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. అయితే, కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరుస్తాయి. తాజాగా ఇటువంటి ఒక డిజాస్టర్ బాలీవుడ్ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా గురించి తెలుసుకుందామా.

Cinema : ఒక్క పాటతో సెన్సేషన్.. కట్ చేస్తే.. ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. 80 కోట్లు పెడితే 8 కోట్లు కూడా రాలేదు..
Azaad Movie
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2026 | 5:52 PM

Share

సినిమా పరిశ్రమలో ఒక సినిమా విడుదలవుతుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ప్రమోషన్లు, స్టార్ కాస్టింగ్ వంటివి ఆ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. అయితే, కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరుస్తాయి. తాజాగా ఇటువంటి ఒక డిజాస్టర్ బాలీవుడ్ చిత్రం గురించి చర్చ జరుగుతోంది, అదే ‘ఆజాద్’. ఈ చిత్రం దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉండటమే కాకుండా, ప్రమోషన్లు కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా పరిస్థితి దారుణంగా తయారైంది. రూ. 80 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా, కనీసం రూ. 8 కోట్ల వసూళ్లను కూడా సాధించలేకపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ సోదరుడి కుమారుడు అమన్ దేవ్‌గన్ హీరోగా పరిచయం కాగా, రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. అంతేకాకుండా, సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గన్ ఇందులో కీలక పాత్ర పోషించారు. స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, సినిమా థియేటర్లలోకి రాగానే ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

సినిమా పరంగా ఘోరంగా విఫలమైనప్పటికీ, ఈ చిత్రంలోని ‘ఉయ్ అమ్మా’ అనే సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ పాట ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ, సరైన కంటెంట్ లేకపోతే సినిమాలు ఎలా బోల్తా పడతాయో చెప్పడానికి ‘ఆజాద్’ ఒక నిదర్శనంగా నిలిచింది. విడుదలకు ముందే రాషా తడాని నటించిన ఉయ్ అమ్మా అనే సాంగ్ సంచలనం సృష్టించినప్పటికీ సినిమా మాత్రం తీవ్ర నిరాశపరిచింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..