అందంతో కిక్కెక్కిస్తోన్న భాగ్య శ్రీ బోర్సే.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు

Rajitha Chanti

Pic credit - Instagram

11 June 2026

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో తన అందం, అభినయంతో యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటున్న సరికొత్త కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన సాంప్రదాయ దుస్తుల (Traditional Looks) ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.

తాజాగా నెట్టింట వైరలవుతున్న ఫోటోలలో భాగ్యశ్రీ లంగా ఓణీలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా మెరిసిపోతోంది. ఆమె నవ్వు, హావభావాలు అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. 

ఆ సినిమాలో కేవలం నటనతోనే కాకుండా, తన గ్లామర్ , డ్యాన్స్ స్టెప్పులతో మొదటి సినిమాతోనే టాలీవుడ్ క్రష్‌గా మారిపోయింది. లేటేస్ట్ ఫోటలలో అందం, స్మైల్ తో కవ్విస్తుంది.

కేవలం మోడరన్ దుస్తుల్లోనే కాదు, హాఫ్ శారీ , పట్టుచీరల వంటి సాంప్రదాయ దుస్తులలో కూడా మరింత అందంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తూ సోషల్ మీడియాలో అలరిస్తుంది ఈ అమ్మడు. 

ఈ ఫొటోలలో భాగ్యశ్రీ కళ్లలో ఉన్న మెరుపు, ఆమె ధరించిన ఆభరణాలు, దుస్తుల డిజైన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. యువ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది.