ధురంధర్ కాకుండా పవన్‌కు బాగా నచ్చిన రీసెంట్ సినిమా ఏంటో తెలుసా?
13 June 2026
Basha Shek
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
అయితే రీసెంట్ గా ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూకు హాజరైన ఆయన రీసెంట్ గా రిలీజైన కొన్ని సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. ధురంధర్ కథనం, దర్శకుడు చూపించిన విధానం, మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయన్నారు.
ధురంధర్ సినిమా చూశానని, అయితే రాజకీయ, పాలనాపరమైన బాధ్యతతలతో బిజీగా ఉండటం వల్ల ధురంధర్ రెండో భాగాన్ని చూడలేకపోయానని పవన్ తెలిపారు.
అయితే ధురంధర్ సినిమాతో పాటు మరో మూవీపైనా ప్రశంసలు కురిపించారు. అదే బారాముల్లా. ఈ సినిమాకు కూడా ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కథ సమకూర్చడం విశేషం.
బారాముల్లా సినిమాలో దర్శకుడు చూపించిన కాశ్మీర్, అక్కడి పరిస్ధితులు నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చాయని పవన్ పేర్కొన్నారు.
కాగా పవన్ కల్యాణ్ నోటి వెంట వచ్చిన ఈ రెండు సినిమాలు దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కినవే. థియేటర్లతో పాటు ఓటీటీలో రికార్డులు సృష్టించినవే
ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. బారాముల్లా కూడా నెట్ ఫ్లిక్స్ లోనే అందుబాటులో ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..