వాటే బ్యూటీ.. చూపులతో కవ్విస్తోన్న దివి.. సెగలు పుట్టిస్తుందిగా..

Rajitha Chanti

Pic credit - Instagram

11 June 2026

తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అందాల తార దివి వాద్య. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజా ఫొటోషూట్‌లో దివి సరికొత్త లుక్‌తో మెరిసిపోయింది. దట్టమైన పచ్చని చెట్ల మధ్య, ప్రకృతి ఒడిలో ఆమె ఇచ్చిన క్లోజప్ పోజులు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఈ షూట్ కోసం ఆమె డస్టీ పింక్ కలర్ లేస్ హాల్టర్-నెక్ టాప్‌ను ఎంచుకుంది. ఆ డ్రెస్‌లో ఆమె ఎంతో హాట్ అండ్ క్యూట్‌గా కనిపిస్తూ, తనదైన గ్లామర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తోంది.

 కేవలం నీ గురించే ఆలోచిస్తున్నా! అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ హైందవి ఈ ఫొటోలను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దివి కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరిగింది. అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసి, పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. ప్రస్తుతం దివి చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.

'హనీ', 'నెపోలియన్ రిటర్న్స్', 'ష్..' చిత్రాలతో పాటు 'ద్రౌపతి 2' వంటి ఆసక్తికరమైన సినిమాలు ఆమె లైన్‌అప్‌లో ఉన్నాయి. వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు.

నటనపై ఉన్న డెడికేషన్ , గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న దివి, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరిన్ని పెద్ద విజయాలను అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.