సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో తెలుగు ముద్దుగుమ్మలు ఫుల్ బిజీ అవుతున్నారు.
వారిలో శాన్వి మేఘన ఒకరు. ఈ ముద్దుగుమ్మ 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది.
ఈ ముద్దుగుమ్మ 2019లో “సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.
ఆ తర్వాత “పిట్ట కథలు”, “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లో ఓ సినిమా చేసింది. తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది శాన్వి .
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. తన క్రేజీ ఫొటోలతో అభిమానుల మతిపోగొడుతోంది. నెటిజన్స్ ఈ భామ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.