పెద్దిలో స్పెషల్ సాంగ్.. ఆ హీరోయిన్‌కు కోట్లలో రెమ్యునరేషన్..
Rajitha Chanti
Pic credit - Instagram
26 April 2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఎంపికవ్వడం, ఆమె తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
శృతి హాసన్ ‘పెద్ది’ సినిమాలోని ఈ ఒక్క పాట కోసం దాదాపు రూ. 1.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలోనూ పలు చిత్రాల్లో శ్రుతి స్పెషల్ సాంగ్స్ చేసింది.
పెద్ది చిత్రంలోని స్పెషల్ సాంగ్ పై చర్చ నడుస్తుంది. కేవలం మూడు లేదా నాలుగు రోజుల షూటింగ్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి మేకర్స్ కూడా వెనకాడలేదని తెలుస్తోంది.
ఈ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. గతంలో రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎవడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
ఆ చిత్రంలోని ‘పింపిల్ డింపిల్’ సాంగ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ‘పెద్ది’ సినిమా కోసం వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
ఈ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. సుమారు 300 మంది డ్యాన్సర్లతో అత్యంత భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది
ఈ నెల (ఏప్రిల్) చివరి నాటికి ఈ సాంగ్ షూటింగ్ పూర్తి చేసి, సినిమాను జూన్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.