మెగా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ మాళవిక మోహనన్.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్.. టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో ఎవరన్న ప్రశ్నకు తడుముకోకుండా ప్రభాస్ పేరు చెప్పింది. తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
‘బాహుబలి’ సినిమా చూసినప్పటి నుంచి పిచ్చపిచ్చగా ఇష్టమని పేర్కొంది. ఆ సినిమా చూశాక ప్రభాస్‌కు తాను వీరాభిమానిని అయిపోయానని ఆయనే తన క్రష్ అని ఓపెన్‌గా చెప్పేసింది.
షూటింగ్ సమయంలో ప్రభాస్ ప్రవర్తన గురించి మాళవిక గొప్పగా చెప్పుకొచ్చింది. ప్రభాస్ అందరితో చాలా మర్యాదగా ఉంటారని, ఆయన ప్రవర్తన తనకు చాలా బాగా నచ్చిందని చెప్పింది.
ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే రుచికరమైన భోజనాన్ని, హైదరాబాద్ బిర్యానీని తను బాగా ఎంజాయ్ చేశానని పేర్కొంది. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్ విందు భోజనాలతో సర్ ప్రైజ్ చేస్తారని తెలిపింది.
నిజానికి మాళవిక మోహనన్ గతంలోనే విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమాలో నటించాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రభాస్ సినిమాతోనే తెలుగు వెండితెరపై మెరిసింది.
ఈ అమ్మడు తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో మెప్పించింది. అంతేకాదు.. స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.