AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదే ఫ్యాన్స్‌కు నచ్చలేదు.. ఆ ఒక్క మార్పు చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..

తెలుగులో ఎంతో మంది దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కొంతమంది దర్శకులు ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు అలాంటి వారిలో జయంత్ సి పరాన్జీ ఒకరు.

అదే ఫ్యాన్స్‌కు నచ్చలేదు.. ఆ ఒక్క మార్పు చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
Jayanth C Paranjee
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2026 | 4:39 PM

Share

టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అయినా దర్శకుల్లో జయంత్ సి పరాన్జీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి మెప్పించారు జయంత్ సి పరాన్జీ. ప్రస్తుతం జయంత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రీతీ జింటా , ఐశ్వర్య రాయ్, సోనాలీ బింద్రే, లీసా రాయ్, అంజలా జవేరీ, బిపాషా బసు వంటి బాలీవుడ్ తారలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు జయంత్ సి పరాన్జీ. అంతే కాదు చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ..

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్

దర్శకుడు జయంత్ సి పరంజీ పవన్ కళ్యాణ్‌తో తీసిన తీన్ మార్ సినిమా తనకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చిందని అన్నారు. తాను ఇకపై రీమేక్‌లు చేయనని గతంలో ప్రకటించినప్పటికీ, తీన్ మార్ సినిమా చేయాలనుకున్నా అని అన్నారు జయంత్. సినిమా నిరాశపరచడానికి మెయిన్ కారణం ఈ చిత్రాన్ని లవ్ ఆజ్ కల్ ఒరిజినల్ కథ నుంచి తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా మార్చలేకపోవడం అని అన్నారు జయంత్. జయంత్ పరంజీ గతంలో విజయవంతమైన రీమేక్‌లు తెరకెక్కించారు.  లక్ష్మీ నరసింహ, శంకర్ దాదా MBBS చిత్రాలు చేసి హిట్ అందుకున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ ఒరిజినల్ కథకు తగిన మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చామని, చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా శంకర్ దాదా MBBSలో విలన్ పాత్రను, ఫైట్స్‌ను క్రియేట్ చేశామన్నారు.. కానీ తీన్‌మార్ విషయంలో అలాంటి మార్పులు చేసే అవకాశం తనకు లభించలేదని ఆయన అన్నారు జయంత్.

ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?

తీన్‌మార్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాసిన తర్వాత తాను ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యా., అప్పటికే చాలా నిర్మాణం పూర్తయిందని జయంత్ తెలిపారు. కథలో మార్పులు చేయాలని పవన్ కళ్యాణ్‌తో చర్చించినప్పటికీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖలేజా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడం వల్ల ఆ మార్పులు చేయకేలకపోయాం.. ఒరిజినల్ కథ తెలుగు ప్రేక్షకులకు, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోదని తనకు ముందే తెలుసని, అయినప్పటికీ ప్రాజెక్ట్ కంటిన్యూ చేశామన్నారు. ఇది అందరం తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు జయంత్. తీన్ మార్ విడుదలైయ్యాక అభిమానుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను జయంత్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష సోను సూద్‌ను పెళ్లి చేసుకుని పవన్ కళ్యాణ్ దగ్గరకు రావడం అనేది తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు జీర్ణించుకోలేని అంశం అని, ఇది ఒక చిన్న లోపమే అయినా సినిమాకు తీవ్ర నష్టం కలిగించిందని తెలిపారు. ఈ ఒక్క అంశాన్ని మార్చి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us