AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు 18 ఏళ్ల వయసులోనే రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. : రవి బస్రూర్‌

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన మ్యూజిక్ తో సినిమా లెవల్ ను మరింత పెంచేస్తున్నారు. ఇంతకు ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరో తెలిసిందా ఆయనే రవి బస్రుర్. కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు.

నాకు 18 ఏళ్ల వయసులోనే రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. : రవి బస్రూర్‌
Ravi Basrur
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2026 | 6:59 PM

Share

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా రవి పేరు మారుమ్రోగింది. కన్నడ హీరో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి రవి అందించిన సంగీతం కూడా ఒక కారణం, ముఖ్యంగా ఆయన హీరో ఎలివేషన్స్ లో ఇచ్చిన బీజీఎమ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. కేజీఎఫ్ 1,2 సినిమాలకు రవి బస్రుర్ సంగీతం అందించారు. ఇక మొన్నామధ్య వచ్చిన సంచలన విజయం సాధించిన ప్రభాస్ సలార్ సినిమాకు కూడా రవి బస్రుర్ నే సంగీతం అందించారు. సలార్ దెబ్బకు రవి కోసం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. చాలా మంది స్టార్ హీరోలు ఆయనతో మ్యూజిక్ చేయించుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కల్ట్ అనే సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో రవి బస్రూర్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రవి బస్రూర్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నేచర్‌కు ఫిదా అయిపోయా అని రవి బస్రూర్ అన్నారు. 25 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాను.. రవి బస్రూర్‌ను కాదు 25 ఏళ్ల నా జర్నీని గుర్తించారు.. విశ్వక్ కోసం నేనెప్పుడూ ఉంటాను అని అన్నారు రవి బస్రూర్. అలాగే ఆయన మాట్లాడుతూ.. నాకు 18 ఏళ్ళు ఉన్నపుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాను అని అన్నారు. రెండోసారి ఓ వ్యక్తి నన్ను సేవ్ చేసాడు.. నాకు కీబోర్డ్ కొనివ్వడంతో  పాటు 35 వేలు ఇచ్చాడు.. ఆయన పేరు రవి. అందుకే నా పేరు ముందు రవి బస్రూర్ అని మార్చుకున్నాను అని అన్నారు.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

దీని గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా రవి బస్రూర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాల పై ఉన్న ఆసక్తితో ఇంట్లో నుంచి వచేశారట. అప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. అప్పటికే మూడు రోజుల నుంచి తిండి తినలేదట.. కేవలం నీళ్లు మాత్రమే తాగేవారట. అయితే ఏ గుడిలో ఏ ఈరోజు ప్రసాదం పెడతారో ఓ లిస్ట్ రాసుకొని ఉంన్చుకున్నారట. ఓ రోజు ఆలస్యంగా వెళ్లడంతో ఆయనకు ప్రసాదం దొరకలేదట. అప్పుడు ఓ పెద్దాయన నన్ను చూసి ఒక వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్లి ఇతను బంగారపు పనులు చేస్తుంటాడు. కానీ సంగీతం అంటే పిచ్చి ఏదైనా పని ఇవ్వు అని చెప్పారు. దానితో అతను నన్ను పనిలో పెట్టుకుంటా అన్నాడు. కానీ నేను వద్దు అని అన్నాను. మరి ఏం కావాలి అని అడిగారు కీబోర్డు కొనుకుంటా ..రూ. 35 వేలు కావాలి అని చెప్పాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డబ్బులు ఇచ్చాడు. పని చేసి డబ్బులు ఇద్దువుగాని అని చెప్పాడు. అసలు పరిచయం కూడా లేని వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన పేరు రవి. అందుకే ఆయన పేరును నా పేరుగా పెట్టుకున్నా. ఆయన పేరు మా ఊరి పేరు కలిసి రవి బస్రుర్ అయ్యింది. నా అసలు పేరు కిరణ్.కానీ  రవి బస్రుర్ అని పిలిస్తేనే సంతోషిస్తా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రవి బస్రుర్.

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us