AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debt: లక్షల్లో అప్పులు ఉన్నా సరే.. ఈజీగా ఇలా తీర్చేయండి.! మీరు చేయాల్సిన పని ఇదే..

అప్పుల ఊబిలో చిక్కుకుని మానసిక ప్రశాంతత కోల్పోతున్నారా? మీ అప్పులను శాశ్వతంగా వదిలించుకుని ఆర్థిక స్వాతంత్ర్యం పొందేందుకు ఈ ప్రాక్టికల్ చిట్కాలను ఓసారి చూసేయండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఒకసారి ఈ స్టోరీ చూసేయండి మరి. మీకే ఆ వివరాలు తెలుస్తాయి.

Debt: లక్షల్లో అప్పులు ఉన్నా సరే.. ఈజీగా ఇలా తీర్చేయండి.! మీరు చేయాల్సిన పని ఇదే..
Loan
Ravi Kiran
|

Updated on: Apr 27, 2026 | 7:19 AM

Share

చాలామంది జీవితంలో అప్పు అనేది ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. “అప్పు లేనివాడు ఎవడు?” అని మనల్ని మనం సమర్థించుకుంటాం కానీ, ఆ అప్పు మన ప్రశాంతతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు అది ఒక నిప్పు లాంటిదని గ్రహించాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే, మీరు తీవ్రమైన ఆర్థిక ప్రమాదంలో ఉన్నారని అర్థం. ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఎంతో విలువైన, ప్రాక్టికల్ పరిష్కారాలను పంచుకున్నారు.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

అప్పుల నుంచి బయటపడాలంటే మొదటి మెట్టు ‘నిజాన్ని అంగీకరించడం’. చాలామంది సమాజంలో తమ పరువు పోతుందని భావించి, ఆస్తులు ఉన్నా వాటిని అమ్మడానికి ఇష్టపడరు. కానీ, ఆస్తి కంటే అప్పు చాలా వేగంగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. వడ్డీలు కట్టలేక తల్లడిల్లే కంటే, ఉన్న ఆస్తులను అమ్మేసి అప్పులన్నీ తీర్చి ‘జీరో’ స్థాయికి రావడం ఉత్తమం. సున్నా నుంచి జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత, అప్పుల టెన్షన్‌లో ఉండే కోట్లాది రూపాయల ఆస్తి కంటే మిన్న.

ఇక అప్పులను ఎలా మేనేజ్ చేయాలంటే.. ముందు మీరు ‘డెట్ రీకన్సోలిడేషన్’ గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు, బయట ఎక్కువ వడ్డీకి ఉన్న అప్పులను తీర్చడానికి తక్కువ వడ్డీకి వచ్చే బ్యాంక్ లోన్లు లేదా హోమ్ లోన్ టాప్-అప్‌లను వాడుకోవచ్చు. దీనివల్ల మీపై నెలవారీ భారం తగ్గుతుంది. అలాగే, అప్పులు ఉన్నవారు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్లు చేయకూడదు. 24 శాతం వడ్డీకి అప్పు పెట్టుకుని, 10 శాతం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లలో పెట్టడం తెలివైన పని కాదు. ముందు అప్పులు తీర్చి, ఆ తర్వాతే పెట్టుబడుల వైపు అడుగులు వేయాలి. ఆర్థిక క్రమశిక్షణతో పాటు సరైన ప్లానింగ్ ఉంటే అప్పుల ఊబి నుంచి ఎవరైనా బయటపడవచ్చు.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా