AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

మందార మొక్కలలో పిండినల్లి సమస్యకు ఇంట్లో ఉండే వస్తువులతోనే సులభంగా పరిష్కారం చేయవచ్చు. ముఖ్యంగా వేసవిలో అధికంగా కనిపించే ఈ తెగులును నియంత్రించడానికి క్రమం తప్పకుండా, మార్చి మార్చి పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేయాలి. డిటర్జెంట్, వేప నూనె మిశ్రమం ఒక అద్భుతమైన మార్గాలు.

ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..
Hibiscus Plant
Ravi Kiran
|

Updated on: Apr 25, 2026 | 7:20 PM

Share

మందార మొక్కలు మన ఇంటి పెరట్లో అందంగా కనిపిస్తూ, ఏడాది పొడవునా పూలను పూస్తాయి. అయితే, ఈ మొక్కలను ప్రధానంగా వేధించే సమస్య ‘పిండినల్లి’. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మొక్క ఆకుల అడుగున, మొగ్గలపై తెల్లటి దూదిలా పేరుకుపోయే ఈ పురుగులు మొక్క రసాన్ని పీల్చేసి, చివరకు అది చనిపోయేలా చేస్తాయి. అనేకమంది తెగులు ముదిరిన తర్వాత స్పందిస్తారు. కానీ మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారానికి ఒకసారి పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయడం ఉత్తమం. మొక్కకు సరిగ్గా నీరు పోయకపోయినా లేదా అధికంగా పోసినా దాని రోగనిరోధక శక్తి తగ్గి పిండినల్లి అటాక్ అయ్యే అవకాశం ఉంది. మొగ్గలు పండుబారి రాలిపోవడం లేదా ఆకులు ముడుచుకుపోవడం వంటివి జరిగితే మీ మొక్క పిండినల్లి బారిన పడిందని గుర్తించాలి.

నివారణకు అద్భుతమైన చిట్కా:

ఇంట్లోనే లభించే వస్తువులతో దీనికి చెక్ పెట్టవచ్చు. ఒక లీటరు నీటిలో 5 మిల్లీలీటర్ల డిటర్జెంట్, 5 మిల్లీలీటర్ల వేప నూనె(లేదా వంట నూనె) కలిపి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కేవలం సాయంత్రం వేళల్లోనే మొక్కలపై స్ప్రే చేయాలి. ఎండలో స్ప్రే చేస్తే ఆకులు కాలిపోయే ప్రమాదం ఉంది. మొక్క మొత్తం, ముఖ్యంగా ఆకుల అడుగు భాగాలు తడిచేలా స్ప్రే చేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి వారం ఒకే రకమైన పెస్ట్ కంట్రోల్ వాడకుండా మార్చి మార్చి స్ప్రే చేయాలి. అప్పుడే తెగుళ్లు మందులకు అలవాటు పడకుండా ఉంటాయి. ఒకవేళ పిండినల్లిని నిర్లక్ష్యం చేస్తే అవి ‘స్కేల్ బగ్స్’గా మారి కాండానికి అతుక్కుపోయి మొక్కను పూర్తిగా నాశనం చేస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటే మీ మందార మొక్కలు ఆరోగ్యంగా, నిండుగా పూలను పూస్తాయి.

ఇది చదవండి: ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా.. అప్పటికప్పుడు ఇలా చేస్తే కరకరలాడాల్సిందే!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!