AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్క మార్పే కూతురిని దగ్గర చేసింది.. షాకింగ్ విషయం షేర్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి కాజోల్. 1992లో 'బేఖుదీ' సినిమాతో అడుగుపెట్టిన ఆమె, మూడు దశాబ్దాలకు పైగా వెండితెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కేవలం నటిగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన తల్లిగా కూడా ఆమె ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

ఆ ఒక్క మార్పే కూతురిని దగ్గర చేసింది.. షాకింగ్ విషయం షేర్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ
Kajol On Mother Daughter Bond And Parenting Gen Z.jpg
Nikhil
|

Updated on: Apr 27, 2026 | 6:45 AM

Share

తన కూతురు నిసాతో ఉన్న బంధం, నేటి తరం పిల్లల (జెన్ జెడ్) పెంపకంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్. ముఖ్యంగా ఒక కూతురికి తల్లిగా ఆమె చేసిన ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, మరికొంత భావోద్వేగంతో సాగింది. కూతురు నిసాకు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఎదురైన ఇబ్బందులను కాజోల్​ దాచకుండా పంచుకుంది. ముఖ్యంగా పిల్లలు యుక్తవయసులోకి వచ్చినప్పుడు తలెత్తే మార్పులు వారి బంధాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించింది.

కూతురితో బంధం

కాజోల్ తన కూతురు నిసాకు 2003లో జన్మనిచ్చింది. నిసాకు పన్నెండేళ్లు వచ్చినప్పుడు వారిద్దరి మధ్య సంబంధం ఎంతో క్లిష్టంగా మారిందని ఆమె గుర్తు చేసుకుంది. హార్మోన్ల ప్రభావం వల్ల నిసా ప్రవర్తనలో మార్పులు రావడం, ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం వంటివి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టాయి. దాదాపు మూడేళ్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడలేదని, ఇద్దరూ మొండిగా ఉండేవారని ఆమె తెలిపింది. అయితే ఒక పెద్ద వ్యక్తిగా తనే వెనక్కి తగ్గి, కూతురిని అర్థం చేసుకోవాలని నిర్ణయించుకుంది. గొడవ పడటం మానేసి, కూతురు చెప్పేది వినడం మొదలుపెట్టిన తర్వాతే వారి మధ్య దూరం తగ్గిందని ఆమె వెల్లడించింది.

తల్లిగా తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏమిటంటే.. పిల్లలతో కేవలం మాట్లాడటం మాత్రమే కాదు, వారు చెప్పేది ఓపికగా వినడం మరియు వారికి తగినంత స్వేచ్ఛను ఇవ్వడం. కేవలం తాను కూతురి పక్కన కూర్చుని ఆమె మనసులోని మాటలను వినడం వల్లే వారి బంధం ఈరోజు ఇంత బలంగా తయారైందని కాజోల్ గర్వంగా చెబుతోంది. ఒక ఆడపిల్ల జీవితం ఎంతో క్లిష్టంగా ఉంటుందని, అందుకే ఆమెకు ఒక స్నేహితురాలిలా తోడుగా ఉండటం అవసరమని ఆమె అభిప్రాయపడింది.

90s వర్సెస్ GenZ

నేటి తరం పిల్లల గురించి మాట్లాడుతూ.. 90వ దశకంలో పెరిగిన వారే అత్యంత అద్భుతమైన తరం అని కాజోల్ కొనియాడింది. సోషల్ మీడియా, ఫోన్లు లేని ఆ రోజుల్లో తాము ఎంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాళ్లమని, ప్రస్తుత పరిస్థితులకు ఎంతో త్వరగా అలవాటు పడ్డామని ఆమె పేర్కొంది. ల్యాండ్‌లైన్ల నుండి స్మార్ట్‌ఫోన్ల వరకు ప్రతి మార్పును తాము ఎంతో సమర్థవంతంగా స్వీకరించామని, అందుకే తమ తరం అత్యంత సర్దుబాటు గుణం గల తరమని ఆమె గర్వంగా చెప్పింది. భవిష్యత్తులో ఎటువంటి ఆపద వచ్చినా 90ల తరం వారు మాత్రమే దానిని ఎదుర్కోగలరని నవ్వుతూ వ్యాఖ్యానించింది.

మరోవైపు నేటి జెన్ జెడ్ తరం పిల్లల గురించి మాట్లాడుతూ.. వారు విపరీతమైన సమాచారంతో సతమతమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తమ కాలంలో సమాచారం తక్కువగా ఉండటం వల్ల ఏదైనా విషయంలో సొంతంగా ఆలోచించే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు పిల్లల చుట్టూ ఇంటర్నెట్ లో కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారం వారిని అయోమయానికి గురి చేస్తోందని కాజోల్ విశ్లేషించింది.

తన ఇద్దరు పిల్లలు (నిసా, యుగ్) సమాచారాన్ని వేర్వేరుగా గ్రహిస్తారని, ఆడపిల్లల మీద సామాజిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఆమె ముగించింది. నిరంతరం నేర్చుకుంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలతో కలిసి ప్రయాణించడమే నిజమైన పేరెంటింగ్ అని కాజోల్ మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి.

Follow Us