ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. దెబ్బకు కనిపించకుండపోయిన హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

21 February 2026

తెలుగులో మొదటి సినిమాతోనే సంచనలం సృష్టించింది. అందం, అమాయకత్వంతో తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ.

ఫస్ట్ సినిమాతోనే ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేయడం ఖాయమనుకున్నారు.

కానీ అలా జరగలేదు. తెలుగులో ఆడపాడదపా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ షాలిని పాండే. ఆమె వయసు 31 సంవత్సరాలు. 2018లో విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీ చేసింది. 

ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది. 

తమిళంలో 100 కథలు, గొరిల్లా, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రాలేదు.

అటు హిందీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అవకాశాలు వచ్చినప్పటికీ అటు బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.