రెండేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ.. మళ్లీ నంబర్ వన్ హీరోయి‏న్‏గా..

Rajitha Chanti

Pic credit - Instagram

21 February 2026

2026లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఇందులో టాప్ నంబర్ వన్ స్థానంలో ఓ బ్యూటీ నిలిచింది.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ సమంత. దాదాపు రెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పుడే ట్రెండింగ్ లో నంబర్ వన్ గా నిలిచింది.

ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నయనతార, త్రిష పేర్లు జాబితాలో 5వ స్థానంలో ఉండడం గమనార్హం.

అలాగే తమన్నా, శ్రీలీల ఈ జాబితాలో టాప్ 10లో తమ స్థానాలను దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు సమంత పేరు మరోసారి మారుమోగుతుంది. 

దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సమంత. రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

గతేడాది డైరెక్టర్ రాజ్ నిడమోరను వివాహం చేసుకున్న సమంత కొత్త జీవితం ప్రారంభించింది. మరోవైపు ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. 

తాను నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది సామ్.

మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే ఆరోగ్య విషయాలు పంచుకుంటుంది.