T20 Cricket: ఇదేం ఆటరా అయ్యా.. ముగ్గురు బ్యాటర్స్‌ జీరో.. మరో ముగ్గురు సింగిల్‌ రన్‌కే.. 30 పరుగులకే ఆలౌట్‌..

టీ20 క్రికెట్ మ్యాచ్‌ అంటేనే బ్యాటర్లకు స్వర్గధామం. పరిస్థితులు ఎలా ఉన్నా ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుంటారు. అందుకే వికెట్లు తీయడం పక్కన పెడితే కనీసం పరుగులు నియంత్రించేందుకు ఆపోసోపాలు పడుతుంటారు బౌలర్లు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంతర్జాతీయ మ్యాచ్‌..

T20 Cricket: ఇదేం ఆటరా అయ్యా.. ముగ్గురు బ్యాటర్స్‌ జీరో.. మరో ముగ్గురు సింగిల్‌ రన్‌కే.. 30 పరుగులకే ఆలౌట్‌..
Cricket
Follow us

|

Updated on: Jul 05, 2022 | 1:23 PM

టీ20 క్రికెట్ మ్యాచ్‌ అంటేనే బ్యాటర్లకు స్వర్గధామం. పరిస్థితులు ఎలా ఉన్నా ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుంటారు. అందుకే వికెట్లు తీయడం పక్కన పెడితే కనీసం పరుగులు నియంత్రించేందుకు ఆపోసోపాలు పడుతుంటారు బౌలర్లు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంతర్జాతీయ మ్యాచ్‌ ఇందుకు పూర్తి విరుద్ధం. బౌలర్ల ధాటికి బ్యాటర్లు చెల్లాచెదురైపోయారు. జట్టు మొత్తం చెల్లాచెదురైపోయింది. అది కూడా కేవలం 30 పరుగులకే. థాయ్‌లాండ్ మరియు మలేషియా మధ్య జరిగిన అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన థాయ్‌ల్యాండ్‌ 13.1 ఓవర్లలో కేవలం 30 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులోని ఏ ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. మొదటి 3 పరుగులకే మూడు టాపార్డర్‌ వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 23 పరుగులకే సగం ఆటగాళ్లు డగౌట్‌లో కూర్చున్నారు. టెయిలెండర్లైనా ఆదుకుంటారంటే అదీ జరగలేదు. వారు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 30 పరుగులకే జట్టు చాపచుట్టేసింది. సుఅంచువాయ్‌ (9) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ప్రత్యర్థి బౌలర్లలో సియాజ్రుల్‌ ఇడ్రస్‌ 4 వికెట్లు నేలకూల్చగా.. విరందీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇక మలేషియా నాలుగు ఓవర్ల లోపే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 3.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఒక మలేషియా ఓపెనర్ ఖాతా తెరవలేకపోయాడు కానీ రెండో ఓపెనర్ విరందీప్ సింగ్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మెన్ సయ్యద్ అజీజ్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే బ్యాటింగ్‌ లో విఫలమైనా బౌలింగ్లో రాణించింది థాయ్‌ల్యాండ్. ఆ జట్టు బౌలర్లు కేవలం 1 ఎక్స్‌ట్రా మాత్రమే ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..