AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే
Sahibzada Farhan Virat Kohli
Rakesh
|

Updated on: Feb 21, 2026 | 2:59 PM

Share

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 220 పరుగులు చేసిన ఈ ఆటగాడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సృష్టించిన ఆల్-టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేస్తాడా? అనే చర్చ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఈ టోర్నీలో ఫర్హాన్ బ్యాటింగ్ తీరును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. నెదర్లాండ్స్‌పై 47 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను, అమెరికాపై 73 పరుగులతో విరుచుకుపడ్డాడు. అయితే భారత్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్‌లోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. కానీ ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోతూ నమీబియాపై చారిత్రాత్మక సెంచరీతో సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా ఫర్హాన్ రికార్డు సృష్టించాడు. ఈ ఫామ్‌తోనే అతను సూపర్-8 లోకి అడుగుపెట్టాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2014 సీజన్‌లో కోహ్లీ 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 319 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 12 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. అయితే, ప్రస్తుతం ఫర్హాన్ ఖాతాలో 220 పరుగులు ఉన్నాయి. కోహ్లీ రికార్డును సమం చేయాలంటే అతనికి ఇంకా 99 పరుగులు, బ్రేక్ చేయాలంటే 100 పరుగులు కావాలి. పాకిస్థాన్ సూపర్-8 లో కనీసం 3 మ్యాచ్‌లు ఆడుతుంది కాబట్టి, ఫర్హాన్‌కు ఈ మైలురాయిని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ పాక్ సెమీస్ లేదా ఫైనల్‌కు చేరితే, ఈ రికార్డు సరికొత్త స్థాయిలో నమోదవ్వడం ఖాయం.

పాకిస్థాన్ సూపర్-8 షెడ్యూల్ ఇదే

సూపర్-8 రౌండ్‌లో పాకిస్థాన్ కఠినమైన సవాళ్లను ఎదుర్కోబోతోంది

ఫిబ్రవరి 21: న్యూజిలాండ్‌తో తొలి సమరం.

ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్‌తో రెండో పోరు.

ఫిబ్రవరి 28: శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్.

ఈ మూడు మ్యాచ్‌ల్లో టాప్-2 లో నిలిస్తేనే పాక్ సెమీఫైనల్ చేరుకుంటుంది. జట్టు గెలుపోటముల సంగతి పక్కన పెడితే, వ్యక్తిగత రికార్డుల పరంగా ఫర్హాన్ దూకుడు చూస్తుంటే కోహ్లీ రికార్డు గజగజ వణుకుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ