AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా విషయంలో నాదే తప్పు.. నేను వేసిన రాంగ్ స్టెప్ అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దిల్ రాజు

టాలీవుడ్ లో తిరుగులేని ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు దిల్ రాజు. డిటిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు దిల్ రాజు. బడా సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు దిల్ రాజు. తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు.

ఆ సినిమా విషయంలో నాదే తప్పు.. నేను వేసిన రాంగ్ స్టెప్ అదే.. ఓపెన్‌గా చెప్పేసిన దిల్ రాజు
Dil Raju
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 1:02 PM

Share

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ పరిశ్రమలో తన అనుభవంతో దిల్ రాజు అనే బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. గతంలో దిల్ రాజు ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాణంలో ఎదురైన పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌లో తన ప్రమేయం, ఎదురైన సవాళ్లు, వ్యక్తిగత వైఫల్యం గురించి దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా నిడివి నాలుగున్నర గంటలు ఉండటం, చివరి కట్‌ను తాను ఆఖరి నిమిషం వరకు చూడలేకపోయానని వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. పెద్ద దర్శకులతో, భారీ చిత్రాలతో పనిచేసేటప్పుడు ఇంటర్ఫియరెన్స్ కష్టం అని అన్నారు, తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాల్సిన బాధ్యత నిర్మాతదేనని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను విఫలమయ్యానని, అది తన మొదటి తప్పు అని ఆయన అంగీకరించారు. “నేను ఆపలేకపోయాను అంటే అది నా వైఫల్యం. నేను అంగీకరించాలి” అని దిల్ రాజు అన్నారు.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

తన 58-60 సినిమాల కెరీర్‌లో పెద్ద దర్శకులతో పెద్ద ప్రాజెక్ట్‌లు చేయడంలో తనకు అనుభవం లేదని దిల్ రాజు అన్నారు. గేమ్ ఛేంజర్ తన రాంగ్ స్టెప్ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్ట్‌లను చేపట్టేటప్పుడు కాంట్రాక్ట్‌లో తన పాయింట్‌లను స్పష్టంగా పేర్కొంటానని, లేదంటే అలాంటి ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉంటానని ఆయన తెలియజేశారు. “ఇది మన స్కూల్ కాదు. స్కూల్ కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి కూడా ఉపయోగం లేదు” అని తెలిపారు. పాన్ ఇండియా సినిమాల విషయంలో, ముఖ్యంగా ఇతర భాషల దర్శకులతో పనిచేసేటప్పుడు మరింత స్పష్టమైన వ్యూహం అవసరమని దిల్ రాజు అన్నారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

దర్శకుడు, నిర్మాత, హీరోల మధ్య ఒకే వేవ్‌లెంత్ ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. వేవ్‌లెంత్ లేనప్పుడు అవుట్‌పుట్ ఆశించిన విధంగా రాదని, అంత కష్టపడిన సినిమాకు ఫలితం రాకపోతే కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడు సినీ రంగంలో నంబర్స్ మారిపోయాయని, చిన్న పొరపాటు కూడా పెద్ద డ్యామేజ్‌కు దారి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్, ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన నేపథ్యంలో, గేమ్ ఛేంజర్ విషయంలో ఏదైనా పశ్చాత్తాపం ఉందా అని అడిగినప్పుడు, “100శాతం పశ్చాత్తాపం ఉంది. నేను చాలా ఫీల్ అవుతాను, ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతాను” అని దిల్ రాజు తెలిపారు. ఇది తన చేతుల్లో లేని విషయం అని, చరణ్ కోఆపరేషన్ బాగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక నిర్మాతగా పెద్ద హీరోల కెరీర్‌లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన చరిత్ర తనది అని గుర్తు చేసుకుంటూనే, గేమ్ ఛేంజర్ విషయంలో తన ప్రమేయం పరిమితంగా ఉందని ఆయన తెలియజేశారు. మొత్తం మీద, గేమ్ ఛేంజర్ సినిమా తన కెరీర్‌లో ఒక గుణపాఠంగా దిల్ రాజుచెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us