AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: ఏం కిరాక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు ఆగేదే లేదు.. ప్రతీ నెలా రూ.3 వేలు ఆదా..

మీరు పెట్రోల్‌పై పెట్టే ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నారా.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఓలా తక్కువ ధరలో హైస్పీడ్ ఈవీ వెహికల్ తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది.

Electric Scooter: ఏం కిరాక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు ఆగేదే లేదు.. ప్రతీ నెలా రూ.3 వేలు ఆదా..
Ola Electric
Venkatrao Lella
|

Updated on: Jun 18, 2026 | 1:04 PM

Share

పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికి పెరుగుతుండటంతో.. సామాన్యులపై భారం పడుతుంది. ప్రతీ నెలా రూ.3 వేల వరకు ఇంధనంపై ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆర్ధిక పరిస్థితి బాలేక ఇబ్బందులు పడే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భారమనే చెప్పుకోవాలి. దీంతో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. వీటి వల్ల ఇంధనంపై పెట్టు ఖర్చు తగ్గుతుంది. తక్కువ ధరలోనే ఈవీ వెహికల్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. దీంతో పెట్రోల్ డబ్బులు ఆదా చేసుకునేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఉన్న డిమాండ్ దృష్ట్యా కంపెనీలన్నీ ఈవీ వాహనాలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ వచ్చే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే రయ్.. రయ్

ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 176 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ రోడ్లపై 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అదే మీరు సిటీలో రోజూ 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే.. మూడు రోజులకు ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం పెట్రోల్ వెహికల్‌కు కిలోమీటర్లకు రూ.2 నుంచి రూ.2.5 ఖర్చు అవుతుంది. మీరు రోజూ 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే నెలకు రూ.3 వేలు ఖర్చు అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ వాడితే కిలోమీటర్‌కు 20 నుండి 30 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక పెట్రోల్ వెహికల్ ఉంటే ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం, క్లచ్ ప్లేట్లను గ్రైండింగ్ చేయడం లాంటి వాటికి అదనపు ఖర్చు అవుతుంది. అదే ఈవీ వాహనాలకు లాంటి ఖర్చు ఏమీ ఉండదు. రూ.లక్షలోపు ధరలోనే ఈ వెహికల్ లభిస్తుంది. ఇదే వేరియెంట్‌తో ఇతర కంపెనీల వెహికల్ ధరలు రూ.లక్షపైనే ఉన్నాయి. కానీ ఓలా రూ.లక్షలోపే ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. ఇది హైస్పీడ్ వెహికల్ కావడంతో స్పీడ్ కూడా వెళ్లవచ్చు.

ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఇవే..

-3kWh, 4kWh వేరియంట్లలో లభ్యం

-3kWh మోడల్‌పై ఒకసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే 176 కిలోమీటర్ల రేంజ్

-3kWh మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.97,381గా ఉంది

-4kWh వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,13,881గా ఉంది

-బ్యాటరీకి 8 సంవత్సరాల వ్యారెంటీ ఉంటుంది.

Follow Us