AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్‌తో పెద్ద గొడవ.. క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది.. చివరకు ఆమే..

దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటుడిగా కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఓ హీరోయిన్ తో జరిగిన గొడవ గురించి తెలిపారు.

ఆ హీరోయిన్‌తో పెద్ద గొడవ.. క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది.. చివరకు ఆమే..
Devi Prasad
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 12:51 PM

Share

ప్రముఖ నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, పలు ఆసక్తికరమైన సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్టార్ హీరోయిన్ తో జరిగిన ఓ గొడవ గురించి మాట్లాడారు, అలాగే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి విశిష్టమైన దర్శకత్వ శైలి వంటి అనేక విషయాలను పంచుకున్నారు. దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఆవేశం అనే సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో హీరోయిన్ నగ్మాతో గొడవ జరిగినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

నగ్మాకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి తగిన గౌరవం లభించడం లేదని భావించి, ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. “తనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని, విష్ చేయకపోతే షూటింగ్‌కి రాను” అని నగ్మా చెప్పారని, దీనితో తామంతా కూడా అప్పటి వయసులో కాస్త దూకుడుగా ఉండేవాళ్లమని, ఆమె గొడవ చేసిన తర్వాత నుంచి ఆమె వస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వంటివి చ్చేసి ఆమెను కావాలని రెచ్చగొట్టామని దేవి ప్రసాద్ అన్నారు. ఈ గొడవ చివరికి పెద్దదై సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిలిం అసోసియేషన్ ఫిర్యాదు చేస్తాం అని చెప్పాం.. ఆ తర్వాత నగ్మా గారు షూటింగ్ కు తిరిగి వచ్చారని, సమస్య సామరస్యంగా పరిష్కరించబడిందని ఆయన వివరించారు. ఈ మొత్తం సంఘటనలను ఆ వయసులో ఉండే “పిల్లతనం, కుర్రతనం” కారణంగా జరిగినవిగా దేవి ప్రసాద్ అభివర్ణించారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

అంతేకాకుండా, దేవి ప్రసాద్ గురువు గారుగా పేర్కొన్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు నటులను ఎంపిక చేసే విధానం గురించి వివరించారు. ఆయనకు ఆహార్యం ఉంటే చాలని, నటన వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కాదని తెలిపారు. ఆడిషన్స్, డైలాగ్ చెప్పడం వంటివి లేకుండా, ఒక పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలని అనిపిస్తే, వారిని నేరుగా కెమెరా ముందు నిలబెట్టి, తనే మొత్తం చెప్పి నటింపజేసేవారని దేవి ప్రసాద్ అన్నారు. కొత్త నటుల కారణంగా ఎక్కువ టేకులు వెళ్లినా, సీనియర్ నటులు ఎప్పుడూ ప్రశ్నించేవారు కాదని, బదులుగా కొత్తవారికి సహకరించేవారని ఆయన పేర్కొన్నారు. అలాగే, తన నటన ప్రవేశం గురించి దేవి ప్రసాద్ మాట్లాడుతూ, మొదట్లో చిన్న పాత్రలు చేయడానికి ఇష్టపడలేదని, కానీ నీది నాది ఒకే కథ చిత్రంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక హీరో పాత్ర లాంటిది ఆఫర్ చేయడంతో, 23-24 రోజుల షూటింగ్‌కు అంగీకరించి నటుడిగా మారానని దేవి ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

Actor Devi Prasad

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!
అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..