AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral VIdeo: పొలానికి వెళ్తుండగా.. పొదల్లో ఏదో అలజడి.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌లో పొద్దుపొద్దున్నే జనాలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉదయాన్నే పొలానికి వెళ్తున్న కొందరు రైతులకు దారి పక్కన ఉన్న పొదల్లోంచి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ రెండు పాములు సయ్యాట ఆడుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral VIdeo: పొలానికి వెళ్తుండగా.. పొదల్లో ఏదో అలజడి.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
Snakes Mating Video
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 12:56 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ వాసులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉదయాన్నే రోడ్డు పక్కన పచ్చని చెట్ల పొదల్లోంచి భారీ శబ్దాలు రావడంతో ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.. తీరా పొదల దగ్గరకు వెళ్లి చూడగా.. అక్కడ రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకొని బుసలు కొడుతూ కనిపించాయి. ఆ సీన్ చూసిన జనాలు తొలుత భయాందోళనకు గురైనప్పటికీ కాస్త దూరంగా వెళ్లి వాటి సయ్యాటను ఆసక్తిగా తిలకించారు. దాదాపు గంటపాటు అలానే ఆడిన పాములు తర్వాత అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోయాయి.

అయితే దూరంగా ఉండి ఈ దృశ్యాలను మొత్తం తమ ఫోన్‌లో రికార్డు చేసిన స్థానికులు వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో గ్రామస్తులు వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి వైరల్ చేశారు. అయితే వర్షాకాలం సీజన్ మొదలయ్యే టైంలో ఇలా పాములు సయ్యాట ఆడడం సహజంగానే జరుగుతుందని స్థానికులు అంటున్నారు.

ఇలాంటి సమయంలో పాములను రెచ్చగొట్టడం చేయకూడదని, వాటికి హాని కలిగించే ప్రయత్నం చేయవద్దని కోరుతున్నారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో పాముల సంచారం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని.. ప్రజలు బయటకు, లేదా పొలాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా పాముకాటుకు గురైతే తక్షణమే హాస్పిటల్‌కు తరలించాలని సూచిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us