Megastar Chiranjeevi: మెగాస్టార్‌ నిజంగానే పేరు మార్చుకున్నారా? అసలు విషయం చెప్పేసిన గాడ్‌ ఫాదర్‌ టీం..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ పేరు మార్చుకున్నట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తల్లో ..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ నిజంగానే పేరు మార్చుకున్నారా? అసలు విషయం చెప్పేసిన గాడ్‌ ఫాదర్‌ టీం..
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:37 PM

Megastar Chiranjeevi: యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. లూసిఫర్‌ రీమేక్‌ గాడ్‌ ఫాదర్‌తో పాటు భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. కాగా తాజాగా గాడ్‌ఫాదర్‌ సినిమాలో మెగాస్టార్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీంతో పాటు ఓ చిన్న వీడియోను కూడా ఫ్యాన్స్‌కు కానుకగా అందజేసింది. ప్రస్తుతం గాడ్‌ఫాదర్‌ లుక్స్‌, వీడియో నెట్టింట దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వీడియోలో ‘Megastar Chiranjeevi’ అని ఉండాల్సిన బదులు ‘Megastar Chiranjeeevi’ గా ఉంది. దీంతో మెగాస్టార్‌ పేరు మార్చుకున్నట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు గాడ్‌ ఫాదర్‌ చిత్రబృందం వీటిని ఖండించింది.

ఎడిటింగ్ లో తప్పిదమే..

ఇవి కూడా చదవండి

గాడ్‌ ఫాదర్‌ మూవీ యూనిట్‌ వీడియోను ఎడిటింగ్‌ చేసేటప్పుడు జరిగిన తప్పిదంతోనే ఇదంతా జరిగిందని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకోలేదంటున్నారు. ఎడిటింగ్‌ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్‌ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్‌ల సలహాలు అస్సలు తీసుకోలేదటున్నారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం పేర్కొంది. ఇందుకు తగ్గట్లే చిత్రబృందం తాజాగా షేర్‌ చేసిన వీడియోలో చిరంజీవి పేరు గతంలోలాగానే ఉండడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..