Vijay Sethupati: మక్కల్ సెల్వన్ జోరు అస్సలు తగ్గట్లేదుగా.. పుష్ప 2 కాకుండా మరో రెండు చిత్రాల్లో విజయ్..

ఇక మరోసారి ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రాబోతున్ పుష్ప 2లో మక్కల్ సెల్వన్ కీలకపాత్రలో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది.

Vijay Sethupati: మక్కల్ సెల్వన్ జోరు అస్సలు తగ్గట్లేదుగా.. పుష్ప 2 కాకుండా మరో రెండు చిత్రాల్లో విజయ్..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:37 PM

డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupati). ఈ మూవీలో రాయనం పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇటీవలే కాతు వాకుల రెండు కాదల్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు విజయ్. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా విలనిజాన్ని పండించడంలోనూ మక్కల్ సెల్వన్ దిట్ట. విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఇక మరోసారి ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రాబోతున్ పుష్ప 2లో మక్కల్ సెల్వన్ కీలకపాత్రలో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ..విజయ్ సేతుపతికి మరో రెండు భారీ చిత్రాల ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న చిత్రం. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా మరో పాన్ ఇండియా చిత్రంలోనూ విజయ్ కు ఛాన్స్ వచ్చిందని.. ప్రస్తుతం చిత్రయూనిట్ మక్కల్ సెల్వన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో విజయ్ జోరు మాత్రం తగ్గడం లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ