KTR: గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కేటీఆర్ రియాక్షన్.. ‘అచ్చేదిన్ ఆగయే’ అంటూ కేంద్రంపై సెటైర్లు..
Domestic LPG Gas Cylinder: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల ఘాటైన విమర్శలు చేస్తున్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR). తాజాగా ఆయన మరోసారి బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. .
Domestic LPG Gas Cylinder: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల ఘాటైన విమర్శలు చేస్తున్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR). తాజాగా ఆయన మరోసారి బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ ‘ అచ్చేదిన్ ఆగయే.. బదాయి హో (మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికీ శుభాకాంక్షలు). వంటింటి గ్యాస్ ధరను కేంద్రం మరోసారి పెంచేసింది. ప్రధాని మోడీ సిలిండర్ ధరను పెంచి గ్యాస్ వినియోగదారులకు మంచి కానుక ఇచ్చారు’ అంటూ సెటైరికల్‌గా రాసుకొచ్చారు. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు బుధవారం (జులై6) దేశీయ చమురు సంస్థలు మరో షాకిచ్చాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో.. గ్యాస్ బండ రేటు 1100 దాటేసింది. ఇక చమురు సంస్థల తాజా నిర్ణయంతో హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఇందులో భాగంగానే కేంద్రానికి మరోసారి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
#AchheDin Aa Gaye ? Badhai Ho #LPG over ₹1050 ? An increase again of ₹50
ఇవి కూడా చదవండిModi Ji’s Gift to all Indian Households? https://t.co/BknwJ2zNfi
— KTR (@KTRTRS) July 6, 2022
సాధారణంగా ప్రతినెలా ఒకటో తారీఖున గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. అయితే ఆ అనందం ఎక్కువ రోజులు ఉండనీయలేదు చమురు సంస్థలు. ఈక్రమంలోనే నెలలో 5 రోజులు గడిచిన తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మరోషారి గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..