Telangana: కేసీఆర్‌ కీలక నిర్ణయాలు! గైడెన్స్‌ సెంటర్లుగా స్టడీ సర్కిళ్లు, గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ఇంకా..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యా, ఉపాధి అంశాలపై మంగళవారం (జులై 5) ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే..

Telangana: కేసీఆర్‌ కీలక నిర్ణయాలు! గైడెన్స్‌ సెంటర్లుగా స్టడీ సర్కిళ్లు, గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ఇంకా..
Kcr
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2022 | 9:31 AM

Intermediate education in all TS gurukuls from 2022-23: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యా, ఉపాధి అంశాలపై మంగళవారం (జులై 5) ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలను ఇంటర్మిడియేట్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై సీఎసం కేసీఆర్‌ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

భరోసా కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా కేవలం రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా.. దేశవ్యాప్తంగా విడుదలయ్యే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు కూడా అందించాలని, చదువుకు తగిన ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించేలా స్డడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. అందుకుగానూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో వర్గానికి ఒక్కోటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఐటిఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. ఈ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు భోజన వసతులు బాల బాలికలకు వేరువేరుగా ఏర్పాటు చేయాలి. వీటిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఐఏఎస్ / ఐపీఎస్ / ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు

ఇవి కూడా చదవండి

అన్ని గురుకులాల్లో ఇంటర్‌ కూడా.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మిడియేట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికలకు ప్రత్యేకంగా విద్యను అందిస్తున్న కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియేట్ విద్యను ప్రవేశ పెట్టాలన్నారు. ప్రతీయేట పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య, టెన్త్‌ తర్వాత వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాకు ఒకటి చొప్పున 33 బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు ప్రస్తుతం ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలతోపాటు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను 17కు పెంచుతామన్నారు. ఆ తర్వాత కాలంలో జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, అందుకు తగినట్లుగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగావకాశాలను కల్పించే కొత్త డిగ్రీ కోర్సులను రూపొందించాలని, అందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే