Telangana: ఆ జిల్లాలో చేపల వర్షం.. రోడ్లపై కుప్పలు తెప్పలుగా చేపలు.. నివ్వెరపోయిన స్థానికులు
వడగండ్ల వాన గురించి తరచూ వింటుంటాం. కానీ, భూపాలపల్లి జిల్లాలో చేపల వాన కురిసింది. దీంతో స్థానిక ప్రజలంతా నివ్వెరపోయారు. ఆ వివరాలు..
Viral Video: వడగాళ్ల వాన గురించి అందరికీ తెలసు. కానీ తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally district)లో చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారీ వర్షానికి కొన్ని చోట్ల చేపలు నేలపైకి వచ్చాయి. రోజుకో చోట చేపల వర్షం కురుస్తోందని లోకల్స్ చెబుతున్నారు. తాజాగా మహదేవపూర్ మండలం( Mahadevpur mandal) అన్నారంలో మంగళవారం రాత్రి చేపల వర్షం కురిసింది. పలువురి ఇళ్లముందు ఉదయాన్నే చేపలు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలంతా నివ్వెరపోయారు. అధిక బరువున్న చేపలను కొందరు పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. సముద్ర తీర ప్రాంతాల్లో, నదులు, చెరువుల్లో సుడిగాలులు వచ్చిన సమయంలో నీటితో పాటు చేపలు ఎగిరి మేఘాలలో చిక్కుకుంటాయని.. అక్కడే ఘనీభవించి కొద్దిదూరం ట్రావెల్ చేస్తాయని చెప్పారు. ఆ మేఘాలు కరిగి వర్షంగా కురిసినప్పుడు వాటిలోని చేపలు కూడా నేలమీద పడతాయని తెలిపారు. అయితే అన్నారంలో చేపల వర్షం కురిసిందని చెప్పలేమన్నారు. ఈ చేపలను వాడుక భాషలో నటు గురక అని.. శాస్త్రీయ నామం అనాబస్ టెస్ట్‌ట్యూడియస్ అని వెల్లడించారు. ఇవి చిన్నపాటి నీళ్ల ధార ఉన్నా పాకుకుంటూ నేలపైకి వస్తాయని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి