Telangana: నేడు, రేపు అతి భారీ వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. కమ్మిన మేఘాలు..
తెలంగాణకు భారీ వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ.బుధ, గురువారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలెర్ట్. ప్రజంట్ రాజధాని హైదరాబాద్(Hyderabad)తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వానలు బుధవారం, గురువారం కూడా కంటిన్యూ అవ్వనున్నాయి. అవును… ఝార్ఖండ్‌పై 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్‌పైకి విస్తరించింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా పయనిస్తోంది. మరోవైపు బే ఆఫ్ బెంగాల్‌పై మరో ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపు ప్రయాణిస్తోంది. ఇక రుతుపవనాలు కూడా యాక్టివ్‌గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. మంచిర్యాల, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది IMD.
కాగా మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 526 ప్రాంతాల్లో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 8.7 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమొల్గరలో 7.9, నల్గొండ జిల్లాల డిండిలో 7.7, నాగర్‌కర్నూల్ జిల్లా మంగాపూర్‌లో 7.5 సెం.మీల వర్షపాతం నమోదయ్యింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి