Shikhar Dhawan : 40 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి పీటలెక్కిన గబ్బర్.. సోఫీ షైన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Shikhar Dhawan : టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్, గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలుస్తున్న ధావన్, 40 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Shikhar Dhawan : టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్, గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలుస్తున్న ధావన్, 40 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన చిరకాల ప్రియురాలు, ఐర్లాండ్ సుందరి సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ శనివారం (ఫిబ్రవరి 21, 2026)న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ తన రెండో వివాహం గురించి అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తొమ్మిదేళ్ల బంధం.. మూడేళ్ల విడాకుల తర్వాత
శిఖర్ ధావన్ మొదటి వివాహం 2012లో బాక్సర్ ఆయేషా ముఖర్జీతో జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట, 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2023లో వీరికి అధికారికంగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శిఖర్ ధావన్ ఒంటరిగానే ఉంటున్నారు. తన కుమారుడు జోరావర్‌కు దూరంగా ఉంటున్న శిఖర్ ధావన్ , తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానుల సానుభూతిని పొందారు. అయితే, ఇప్పుడు సోఫీ షైన్‌తో వివాహం జరగడంతో ఆయన జీవితంలో మళ్లీ సంతోషం వెల్లివిరుస్తోంది.
Happy Married life to Shikhar Dhawan ♥️ pic.twitter.com/dDPVkvIgYm
— Johns. (@CricCrazyJohns) February 21, 2026
ఎవరీ సోఫీ షైన్? శిఖర్ ధావన్ తో పరిచయం ఎలా?
శిఖర్ ధావన్ రెండో భార్య సోఫీ షైన్ గురించి నెటిజన్లు ఆసక్తిగా గాలిస్తున్నారు. సోఫీ వృత్తిరీత్యా ఒక ప్రొడక్ట్ కన్సల్టెంట్. ఆమె ఐర్లాండ్‌లోని లైమరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కాజిల్ రాయ్ కాలేజీ నుంచి మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో పట్టా పొందారు. సోఫీ కెరీర్ పరంగా కూడా చాలా సక్సెస్ ఫుల్ పర్సన్. ఆమె అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరికీ 2024లో పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని సమాచారం. 2025లోనే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వీరి డేటింగ్ విషయం దాదాపు ఖరారైపోయింది.
View this post on Instagram
సోషల్ మీడియా స్టార్.. లక్షలాది మంది ఫాలోవర్లు
సోఫీ షైన్ కేవలం కార్పొరేట్ ఉద్యోగి మాత్రమే కాదు, ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 3 లక్షల 70 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె తరచుగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను అలరిస్తుంటారు. శిఖర్ ధావన్ కూడా తన ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్ వీడియోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి, వీరిద్దరి అభిరుచులు కలిశాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శిఖర్ ధావన్ తన రెండో పెళ్లితో జీవితంలో మళ్లీ వెలుగులు నింపుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
