AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cracked Heels: రూపాయి ఖర్చు లేకుండా పగిలిన మడమల నుంచి విముక్తి.. వేరుశెనగ పెంకులతో ఇలా చేస్తే చాలు!

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం, ముఖంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే అన్నిటికంటే వికారంగా, నొప్పిగా అనిపించే ప్రధాన సమస్య పగిలిన మడమలు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడుతున్నారా? అయితే ఒక్కసారి మీ వంటగది వైపు చూడండి! మనం సాధారణంగా పనికిరానివని పారేసే వేరుశెనగ తొక్కల్లో (Peanut Shells) అద్భుతమైన చర్మ సంరక్షణ రహస్యాలు దాగి ఉన్నాయి..

Cracked Heels: రూపాయి ఖర్చు లేకుండా పగిలిన మడమల నుంచి విముక్తి.. వేరుశెనగ పెంకులతో ఇలా చేస్తే చాలు!
Cracked Heels Home Remedy
Bhavani
|

Updated on: Feb 21, 2026 | 7:44 PM

Share

మడమల పగుళ్లు కేవలం అందవికారంగానే కాకుండా, కొన్నిసార్లు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వేరుశెనగ పెంకులలో ఉండే సహజ సిద్ధమైన నూనెలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చనిపోయిన చర్మ కణాలను తొలగించి, పాదాలకు తిరిగి తేమను అందిస్తాయి. వీటిని ఉపయోగించి పగిలిన మడమలను శాశ్వతంగా ఎలా నయం చేసుకోవచ్చో, ఆ మ్యాజిక్ రెసిపీ ఏంటో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

ఎండిన వేరుశెనగ తొక్కలు: పొడి చేయడానికి సరిపడా

కొబ్బరి నూనె: ఒక చెంచా

తేనె: అర చెంచా

పచ్చి పాలు: పేస్ట్ చేయడానికి తగినంత

ఎలా చేయాలి?

ముందుగా ఎండిన వేరుశెనగ పెంకులను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ పొడిని తీసుకుని దానికి ఒక చెంచా కొబ్బరి నూనె, అర చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమం చిక్కటి పేస్ట్‌లా అయ్యేందుకు అవసరమైన మేరకు పచ్చి పాలను పోసి బాగా కలపాలి. ఇప్పుడు మీ పాదాల పగుళ్లను మాయం చేసే సహజ సిద్ధమైన ఫుట్ క్రీమ్ సిద్ధం!

ఎలా ఉపయోగించాలి?

మొదట మీ పాదాలను గోరువెచ్చని నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల చర్మం మెత్తబడుతుంది. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న వేరుశెనగ తొక్కల పేస్ట్‌ను మడమలపై అప్లై చేసి, సుమారు 5-7 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. మరో 15-20 నిమిషాల పాటు దానిని అలాగే ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పాదాలు ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ పద్ధతిని పాటిస్తే, పగిలిన మడమలు మృదువుగా మారి సిల్కీగా తయారవుతాయి. కేవలం వంటగదిలోని వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా మీ పాదాల అందాన్ని తిరిగి పొందవచ్చు.

Follow Us