March Horoscope: 30 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. మార్చి 1 నుంచి ఈ రాశుల వారికి తిరుగుండదు.. డబ్బే డబ్బు!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 2026 నెల అత్యంత కీలకమైనదిగా మారుతోంది. ఈ నెలలో బుధుడు, కుజుడు, సూర్యుడు రాహువు వంటి శక్తివంతమైన గ్రహాలు కుంభరాశిలో కలవడం వల్ల అనేక అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. బుధాదిత్య, మంగళాదిత్య, నవపంచ రాజయోగాలతో పాటు చతుర్గ్రహ యోగం వంటివి కొన్ని రాశుల జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఆ ఆసక్తికర మార్పులేంటో చూద్దాం.

గ్రహాల గమనంలో వచ్చే ఈ వినూత్న మార్పుల వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆ అదృష్ట రాశులేవి? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకుందాం. మార్చి నెల ప్రారంభం నుంచే గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి. మార్చి 02న శుక్రుడు మీనరాశిలోకి, మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నారు. 30 సంవత్సరాల తర్వాత శని బుధుల అరుదైన కలయిక వల్ల కెరీర్ పరంగా భారీ పురోగతి ఉండబోతోంది.
మేష రాశి – విజయాల పరంపర
మేష రాశి వారికి మార్చి నెల ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభించడమే కాకుండా పదోన్నతులకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం దొరుకుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభ రాశి – ఆర్థిక లాభాలు
వృషభ రాశి వారికి ఈ నెలలో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఊహించని విధంగా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. పనిలో పై అధికారుల మద్దతు లభించడం వల్ల మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఈ నెలలో ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
మీన రాశి – కెరీర్ లో వేగవంతమైన వృద్ధి
మీన రాశి వ్యక్తులకు మార్చి నెల ఒక వరంలా మారుతుంది. మీ కెరీర్‌లో మీరు ఎన్నడూ చూడని వేగవంతమైన వృద్ధిని చూస్తారు. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. ఉద్యోగంలో జీతం పెరగడమే కాకుండా మీకు అప్పగించే కొత్త బాధ్యతలు మీ ప్రతిభను నిరూపిస్తాయి. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహ రాశి – సర్వతోముఖాభివృద్ధి
సింహ రాశి వారికి ఈ నెల శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం, విద్య, ప్రేమ వివాహ జీవితం.. ఇలా అన్ని రంగాల్లోనూ మీకు సానుకూల మార్పులు కనిపిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దంపతుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వరిస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.
