AP SSC Supply Exams: నేటి నుంచి ఏపీ పదో తరగతి- 2022 సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం (జులై 6) నుంచి ప్రారంభంకానున్నాయి. 2021-22 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌తోపాటు, బెటర్‌మెంట్ పరీక్షలు కూడా ఈ రోజు నుంచి జరుగుతాయి..
AP SSC Supplementary Exams 2022 from today: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం (జులై 6) నుంచి ప్రారంభంకానున్నాయి. 2021-22 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌తోపాటు, బెటర్‌మెంట్ పరీక్షలు కూడా ఈ రోజు నుంచి జరుగుతాయి. జులై 6 నుంచి 15 వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు దాదాపు 986 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. 8,609 మంది విద్యార్ధులు బెటర్మెంట్ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో సప్లిమెంటరీకి సంబంధించి బాలికలు 90,334 మంది, బాలురు 1,16,826 మంది ఉన్నారు. బెటర్మెంటు రాసేవారిలో బాలురు 4,737 మంది, బాలికలు 3,872 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం మించితే ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని, కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని, హాల్ టికెట్లతో పరీక్షలకు హాజరుకావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
గత రెండేళ్లగా పరీక్షలు నిర్వహించని ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలకు 6,21,799ల మంది విద్యార్ధులు హాజరుకాగా 4,14,281 మంది విద్యార్థులు (67.72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలయిన 2,01,627ల మంది విద్యార్ధులతోపాటు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులు కూడా నేటి నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.