- Telugu News Photo Gallery PV Sindhu Birthday Special 2022: Here are some interesting facts about PV Sindhu
PV Sindhu Birthday: పీవీ సింధు గురించి మీకు తెలియని విషయాలు..!
బ్యాడ్మింటన్ కావాలనే తన కల అంత ఈజీగా నెరవేరలేదంటోది పీవీ సింధు. తెల్లవారుజామున మూడు గంటలకు లేచి 60 కిలోమిటర్ల దూరంలోనున్న పుల్లెల గోపీచంద్ అకాడమీకి ప్రాక్టీస్ కోసం వెళ్లేది. ఇలా రోజూ ప్రాక్టీస్ చేయడానికి 120 కిలోమీటర్లు ప్రయాణించేది. అంత కష్టం వృథాపోలేదనడానికి..
Updated on: Jul 05, 2022 | 12:21 PM

బ్యాడ్మింటన్ కావాలనే తన కల అంత ఈజీగా నెరవేరలేదంటోది పీవీ సింధు. తెల్లవారుజామున మూడు గంటలకు లేచి 60 కిలోమిటర్ల దూరంలోనున్న పుల్లెల గోపీచంద్ అకాడమీకి ప్రాక్టీస్ కోసం వెళ్లేది. ఇలా రోజూ ప్రాక్టీస్ చేయడానికి 120 కిలోమీటర్లు ప్రయాణించేది. అంత కష్టం వృథాపోలేదనడానికి బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు సాధించిన ఘనత చూస్తే అర్థమవుతుంది.

స్టార్ షట్లర్ పీవీ సింధు పుట్టిన రోజు నేడు. 1995 జులై 5 న జన్మించిన సింధూ నేడు 27వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఆమె తల్లిదండ్రులు పీపీ రమణ, పీ విజయ కూడా జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్లు కావడం గమనార్హం. తండ్రి పీపీ రమణ 2000 సంత్సరంలో అర్జున అవార్డును గెలుచుకున్నారు.

2012లో జరిగిన అక్క పి దివ్య వివాహానికి 17 ఏళ్ల వయసున్న సింధు హాజరుకాలేకపోయింది. ఆ సమయంలో లక్నోలోని సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో ఆడి ఫైనల్‌కు చేరుకుంది.

2016 రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన సింధుకు సచిన్ టెండూల్కర్ బీఎమ్‌డబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. పీవీ సింధుకు ఆంధ్రా స్టైల్ మినేటెడ్ కర్రీ, ఫిష్ కర్రీ, స్వీట్ పెరుగు, ఐస్ క్రీం అంటే చాలా ఇష్టపడతారు.

సైనా నెహ్వాల్ తర్వాత ఒలంపిక్ మెడల్ సాధించిన రెండో భారతీయ బ్యాట్మింటన్ పీవీ సింధు. రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన రెండవ భారతీయురాలు మన పీవీ సింధు.




