- Telugu News Latest Telugu News Natu4ral Helath Tips: Natural Pain Killers these things in kitchen can make your kidney and liver healthy
Natural pain killers: వంటింట్లో ఉండే ఈ వస్తువులు సహజ ఔషధాలు.. కీళ్ల నొప్పులకు వీటితో చెక్ పెట్టండి..
Natural Pain Killers: భారతదేశంలో వంటిల్లే ఓ ఔషధాల గని. పోపుల పెట్టెలో దొరికే పదార్ధాలు ఆహారానికిరుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. వంటగదిలో ఉండే కొన్ని మసాలాదినుసులు సహజ నొప్పి కిల్లర్స్‌గా పనిచేస్తాయి. కాలేయం-కిడ్నీ వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Updated on: Jul 05, 2022 | 1:40 PM

ఔషధాలతో పనిలేకుండా వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులతో శరీరంలోని నొప్పిని తగ్గించవచ్చు. అంతేకాదు ఇలా సహజమైన చికిత్సతో శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మరోవైఫు శరీరంలోని అవయవాల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

పుదీనా: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పుదీనా నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుండి. పుదీనాను ఇంగ్లిష్ మెడిసిన్స్ లో కూడా ఉపయోగిస్తారు. ఇది మన కండరాల ఆరోగ్యాన్ని జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచుతుంది. పుదీనా ఆకులతో కడుపు నొప్పి తగ్గుతుంది.

రోజ్‌మేరీ: శరీరంలోని కీళ్లలో నొప్పితో ఇబ్బంది పడేవారికి రోజ్‌మేరీ ఆయిల్‌తో మసాజ్ చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి నివారణకు కూడా రోజ్ మీరీ చక్కటి మెడిసిన్.

అల్లం: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అమ్మమ్మల కాలం నుంచి అనేక అనారోగ్య సమస్యలకు అల్లం చికిత్సగా ఉపయోగపడుతోంది. పీరియడ్స్ సమయంలో దీని టీ తాగడం వల్ల మహిళలు రుతుక్రమంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు.

పసుపు: ఔషద గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు అనేక వ్యాధులకు మందు. ఇది క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. శరీరంలో గాయం అయితే పసుపు పాలు తాగితే గాయం త్వరగా తగ్గుతుంది.

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. నిజనిర్ధారణ కోసం మీ శరీరానికి సంబంధించిన వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది)




