Mother Lion: అమ్మ ఎవరికైనా అమ్మే… నెట్టింట వైరల్ అవుతున్న హార్ట్ టచ్చింగ్ వీడియో..
అమ్మ... ప్రత్యామ్నాయమే లేని రూపం.. అమ్మకు సాటి మరొకటి లేదు.. అందుకే అమ్మను మించిన దైవం లేదు అంటారు. సహనానికి మారుపేరు అమ్మ. అందుకే అమ్మంటే ఇష్టపడని పిల్లలుండరు.
అమ్మ… ప్రత్యామ్నాయమే లేని రూపం.. అమ్మకు సాటి మరొకటి లేదు.. అందుకే అమ్మను మించిన దైవం లేదు అంటారు. సహనానికి మారుపేరు అమ్మ. అందుకే అమ్మంటే ఇష్టపడని పిల్లలుండరు. ఇది మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. కాగా, అమ్మ ప్రేమ, సహనాన్ని కళ్లకుకట్టే ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక సింహం తన పిల్లలతో సహా ఓ నీటి కుంట దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతుంది. ఈ సమయంలో పిల్ల సింహాలు తల్లి తోకను పట్టుకొని లాగుతుంటాయి. ఇంకో బుల్లి సింహం తల్లి సింహం వీపుపైకి ఎక్కి కిందకు పైకి దూకుతూ ఉంటుంది. అయినా ఆ తల్లి సింహం కోపం తెచ్చుకోకుండా… ఎంతో ఓపికగా నీళ్లు తాగుతుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘దేవుడి తర్వాత తల్లులకే ఎక్కువ ఓర్పు ఉంది’ అని సుశాంత నంద ఈ వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ‘తల్లి అంటే తల్లే’ అని ఒకరు అంటే.. ‘ సృష్టిలో తల్లి పాత్ర అంత ఈజీ కాదు.. ఎన్నో భరించాలి’ అని మరొకరు కామెంట్ చేశారు. ఆ తల్లి సింహం ప్రేమకు ఫిదా అయిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

