Video Viral: నీటిలో అద్భుతం.. 2500 పేపర్లతో కమల్ హాసన్ చిత్రం రూపకల్పన

కేరళలో (Kerala) ని త్రిసూర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు సురేశ్ ప్రస్తుతం కమల్‌ హాసన్‌కు సంబంధించిన భారీ చిత్రాన్ని నీటిలో రూపొందించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులు పేపర్ ఆర్ట్ కోసం ఉపయోగించే ఫోమ్ షీట్ అనే...

Video Viral: నీటిలో అద్భుతం.. 2500 పేపర్లతో కమల్ హాసన్ చిత్రం రూపకల్పన
Kamala Hasan Picture Video
Follow us

|

Updated on: Jul 06, 2022 | 11:59 PM

కేరళలో (Kerala) ని త్రిసూర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు సురేశ్ ప్రస్తుతం కమల్‌ హాసన్‌కు సంబంధించిన భారీ చిత్రాన్ని నీటిలో రూపొందించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులు పేపర్ ఆర్ట్ కోసం ఉపయోగించే ఫోమ్ షీట్ అనే 2500 ఫ్లోటింగ్ పేపర్‌లను ఉపయోగించి కమల్ హాసన్ (Kamal Hasan) చిత్రాన్ని నీటిలో రూపొందించారు. దీనిని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. సురేశ్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్‌లోని రిసార్ట్‌లోని ఐదవ అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో డావిన్సీ సురేష్ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు స్టేడియంలు, ఇండోర్ మైదానాలు, మైదానాల్లో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆయన తొలిసారిగా నీటిపై ప్రదర్శించారు. కమల్ హాసన్ కు సంబంధిచి 35 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో 10 రంగుల కాగితంతో నీటిలో రూపొందించిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..