Viral Video: అయ్యో పాపం.. స్టంట్ చేయాలనుకున్న వయ్యారి.. ఎగిరి గాల్లో జంప్ చేసి
ప్రతిరోజూ సోషల్ మీడియాలో స్టంట్స్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వైరల్ అవుతంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం బాధను కలిగిస్తాయి. అయ్యో పాపం అనిపించేలా చేస్తాయి. ప్రస్తుతం...
ప్రతిరోజూ సోషల్ మీడియాలో స్టంట్స్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వైరల్ అవుతంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం బాధను కలిగిస్తాయి. అయ్యో పాపం అనిపించేలా చేస్తాయి. ప్రస్తుతం అలాంటి స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి నడుస్తున్న అబ్బాయి భుజంపై చేయి వేసి ఫీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరుక్షణం ఊహించనిది జరిగింది. వైరల్ అయిన ఈ క్లిప్ కేవలం 7 సెకన్లు మాత్రమే. అయితే ఇది చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆ అమ్మాయి పరిస్థితి చూసి జాలి పడతారు. ఇంటి తోటలో ఒక అబ్బాయి, అమ్మాయి ఫీట్ చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. అమ్మాయి పరిగెత్తుకుంటూ దూకి, అబ్బాయి భుజంపై చేయి వేసి, అబ్బాయి తన చేతులతో ఆమె కాళ్లను పట్టుకుంటాడు. అమ్మాయి దూకిన తర్వాత యువకుడు బ్యాలెన్సింగ్ చేసుకోలేక యువతి నేరుగా నేలపై పడుతుంది. ఈ ఘటనలో ఆమె శరీర బరువంతా తలపై పడటంతో ఈ వీడియో చూసిన వారందరూ అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి— Funny Fail Videos (@Failvids_) April 23, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఫన్నీ ఫెయిల్ వీడియోస్ అనే ఖాతాతో షేర్ చేశారు. వీడియో అప్‌లోడ్ అయినప్పటి నుంచి దాదాపు 39 వేల వ్యూస్ వచ్చాయి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఫన్నీ వీడియో కాదని, ఈ స్టంట్ యువతికి తీవ్ర బాధ కలిగించిందని కామెంట్లు చేస్తున్నారు.