AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spicejet: స్పైస్‌జెట్‌కు ఏమైంది.? ఎయిర్‌లైన్స్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..

Spicejet: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు రావడం అందరిని షాక్‌కు గురిచేసింది. సాంకేతిక లోపాలపై వెంటనే వివరణ..

Spicejet: స్పైస్‌జెట్‌కు ఏమైంది.? ఎయిర్‌లైన్స్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..
Narender Vaitla
|

Updated on: Jul 06, 2022 | 9:39 PM

Share

Spicejet: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు రావడం అందరిని షాక్‌కు గురిచేసింది. సాంకేతిక లోపాలపై వెంటనే వివరణ ఇవ్వాలని స్పైస్‌జెట్‌ యాజమాన్యానికి డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు విమానాల నిర్వహణలో కూడా తీవ్ర లోపాలు గుర్తించామని డీజీసీఏ తెలిపింది. స్పైస్‌జెట్‌ యాజమాన్యం ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం లేదని కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.

స్పైస్‌జెట్‌ ట్‌కు విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. మంగళవారం రెండు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాజాగా స్పైస్‌జెట్‌ కార్గో విమానం ఒకటి సాంకేతిక లోపంతో కోల్‌కతా వెనుదిరిగింది. ఈ ఘటన కూడా మంగళవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పైస్‌జెట్‌ బోయింగ్‌ 737 కార్గో విమానం కోల్‌కతా నుంచి చైనాలోని చాంగ్‌కింగ్‌ బయలుదేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికి విమానంలో వెదర్‌ రాడార్‌ పనిచేయడం లేదని కమాండ్ పైలట్‌ గుర్తించారు.

దీంతో వెంటనే విమానాన్ని తిరిగి కోల్‌కతా మళ్లించారు. మంగళవారం ఢిల్లీ నుంచి దుబాయి వెళ్తోన్న స్పైస్‌జెట్‌ విమానం ఒకటి పాక్‌ గగనతలంలో ఉండగా.. ఇంధన ఇండికేటర్‌ సరిగా పనిచేయలేదు. దీంతో విమానాన్ని వెంటనే కరాచీకి దారిమళ్లించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబయి వెళ్తోన్న మరో స్పైస్‌జెట్ విమానంలో.. 23వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌కు పగులు ఏర్పడింది. దీంతో పైలట్లు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు కన ల్యాండింగ్‌ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..