Covid Booster Dose: బూస్టర్ డోస్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక ఆరు నెలలకే..
Covid Booster Dose: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరస్ అదుపులో ఉంది. కరోనా కట్టడికి ప్రపంచ..
Covid Booster Dose: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరస్ అదుపులో ఉంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు, ముఖ్యంగా వ్యాక్సినేషన్ కారణంగా ప్రస్తుతం అదుపులో ఉంది. ఇక మొదటి దశ, రెండో దశ టీకాల తర్వాత బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా బూస్టర్ డోస్‌పై కీలక ప్రకటన వెలువడింది. బూస్టర్ డోస్ వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటి వరకు ఈ వ్యవధి 9 నెలలుగా ఉంది. దీంతో రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. ఇక దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవధిని తగ్గిస్తూ కేంద్రం ఈ ప్రకటన వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ప్రికాషనరీ డోసు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేస్తుండగా, రెండో డోసు తీసుకుని 9నెలలు పూర్తయిన వారికి అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని నిపుణులు సూచిస్తుండటంతో దీనిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర సర్కార్.. ఈ గడువును 6 నెలలకు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
18-59 ఏళ్ల మధ్య ఉన్నవారు 2వ డోసు ఇచ్చిన తేదీ నుంచి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్ డోస్‌ను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న లబ్దిదారులతో పాటు హెల్త్‌కేర్ వర్కర్స్ (HLW) కోసం 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి